Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింగిల్ చపాతీ తినే చంద్రబాబుకు పాంట్రీకారు అవసరమా?: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ నేతలు డబ్బును వెదజల్లుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్

సింగిల్ చపాతీ తినే చంద్రబాబుకు పాంట్రీకారు అవసరమా?: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
, శనివారం, 19 ఆగస్టు 2017 (14:58 IST)
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ నేతలు డబ్బును వెదజల్లుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బు తరలిస్తున్నారే అనుమానం వచ్చిన వాహనాలను తనిఖీ చేయిస్తే టీడీపీ నేతలకు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఆయన నిలదీశారు. 
 
నంద్యాలలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘గాజులపల్లెమెట్ట’ ఘటనలో చంద్రబాబు ప్యాంట్రీ కారును మాత్రమే తనిఖీ చేసి, కారు, బస్సులను చెక్‌ చేయకుండా వదిలేశారని తెలిపారు. రోజుకు ఒక చపాతీ మాత్రమే తినే చంద్రబాబుకు పాంట్రీకారు అవసరామా అని ఎద్దేవా చేశారు. కేబినెట్లోకి ఒక్క ముస్లింను కూడా తీసుకోని చంద్రబాబు... నంద్యాల ముస్లింలకు ఏదో చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. టీడీపీ నేతలు నోట్ల కట్టలను కుమ్మరించినా... అంతిమ విజయం వైసీపీదేనని చెప్పారు.  
 
నంద్యాలలో నోట్ల కుట్టలు కుమ్మరించినా టీడీపీ గెలవలేదని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అన్నారు. ‘వీళ్ల(టీడీపీ) అక్రమాలను కళ్లారా చూసిన ఓటర్లు.. రేపు తలవంచుకుని పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తారు. చంద్రబాబుకు బుద్ధిచెబుతారు. వైఎస్సార్‌సీపీ గెలుపే ప్రపంచానికి నిజమైన వార్త అవుతుంది’ అని వ్యాఖ్యానించారు.
 
2014లో చంద్రబాబును నమ్మి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేశారు. మూడేళ్ల తర్వాత.. చంద్రబాబు మోసాలను పవన్‌ గుర్తించారు. అందుకే రాష్ట్రాన్ని నాశనం చేస్తోన్న టీడీపీకి దూరంగా జరిగారు. పవన్‌ అభిమానులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హితవు పలికారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా సంగతి తెలీదు... అర్థగంటలో 30 కోట్ల మందిని లేపేస్తాం... అమెరికా వార్నింగ్