సంక్షేమ పథకాల అమలులో దూకుడుగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు పథకాలు అమలు చేసిన ఆయన, నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి రెడీ అయ్యారు. ఇప్పటికే పలు పథకాలు అమలు చేసిన ఆయన, నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి రెడీ అయ్యారు.
ఉగాది పర్వదినాన 25లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం వైసీపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
అందుకు ప్రభుత్వ భూములను కేటాయించడంతో పాటు ఇతర ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా స్థలాలను సేకరిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను తమ ఆధీనంలో ఉంచుకున్న వారి నుంచి కూడా భూములను స్వాధీనం చేసుకోనున్నారు.
అదేవిధంగా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూముల్లో నిరూపయోగంగా ఉన్న వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.