Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతి అబద్ధం.. అంతా బాహుబలి సెట్టింగులే... వై.ఎస్. జగన్

Advertiesment
YS Jagan mohan Reddy
, బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (22:20 IST)
పాదయాత్ర పూర్తయిన తరువాత మొదటిసారి ఎన్నికల సమర శంఖారావాన్ని తిరుపతి వేదికగా పూరించారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. వైసిపి మ్యానిఫెస్టోలో ఏమేం పొందుపరిచామో వాటినన్నింటిని చంద్రబాబు కాపీ కొడుతున్నారని, మేము ఇచ్చే హామీలన్నింటినీ బాబు ముందుగానే ఇచ్చేస్తున్నారని చెప్పారు.
 
పసుపు - కుంకుమ కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఆయనను నమ్మరని స్పష్టం చేశారు జగన్. ఎపిలో రైతుల ఆత్మహత్యలకు తెలుగుదేశం ప్రభుత్వం చేతకానితనమే కారణమన్న జగన్.
 
కులానికి కార్పొరేషన్ పెట్టిన వ్యక్తి బాబు అంటూ విమర్సించారు. ఎన్నికలకు ఆరు నెలలకు ముందు చంద్రబాబు ప్రజలు గుర్తుకు వస్తున్నారని, అమరావతి నిర్మాణం అంతా అబద్థమన్నారు. అవన్నీ బాహుబలి సెట్టింగ్‌లేనని ఎద్దేవా చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త కువైట్‌లో... విరహం తట్టుకోలేక పదోతరగతి విద్యార్థితో వివాహిత..?