Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాపై ఈగ వాలితే అక్కాచెల్లెళ్ళే తోలుతీస్తారు... ఢిల్లీకి రాగానే కళ్లు నెత్తికెక్కాయా?

Advertiesment
Chandrababu Naidu
, బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:59 IST)
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తనపై ఈగ వాలితే నా అక్కా చెల్లెళ్లే తోలు తీస్తామని చెబుతారని ఆయన అన్నారు. అహంభావంతో ప్రవర్తించే వారికి పతనం తప్పదన్నారు. ఇప్పుడాపరిస్థితి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఏర్పడిందన్నారు. నాలుగేళ్ళ క్రితం అమిత్ షా ఎక్కడున్నారనీ, ఢిల్లీకి రాగానే కళ్లు నెత్తికెక్కాయా అంటూ ప్రశ్నించారు. 
 
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ, తాము మళ్లీ బీజేపీతో చేతులు కలపుతామని అమిత్ షా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో దివంగత వాజ్‌పేయితో పోరాడినట్టు గుర్తు చేశారు. పైగా, ఇపుడున్నది విలువలతో కూడిన బీజేపీ కాదు.. కేవలం మోడీ - షా బీజేపీ. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేయమని పదేపదే కోరుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. 
 
పైగా, గత నాలుగున్నరేళ్ళ కాలంలో అమిత్ షా కుమారుడు జై షా ఆస్తులు ఏకంగా రూ.16 వేల కోట్ల మేరకు ఎలా పెరిగాయని ఆయన ప్రశ్నించారు. పలాసలో జరిగిన సభలో ప్రజలకు బదులు కుర్చీలు కనిపించాయి. ఇకపోతే.. పెళ్లాని సరిగా చూసుకోలేనివాడు దేశాన్నే చూసుకుంటాడని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీనే ప్రశ్నిస్తుంచాడని చంద్రబాబు గుర్తుచేశారు. 
 
పైగా, నాది యూటర్న్‌ కాదు.. రైట్‌ టర్న్‌. మీవే వంకరటింకర టర్న్‌లు. తెలుగుజాతి కోసం మీతో కలిశాను. నమ్మక ద్రోహం చేయడంతో తిరుగుబాటు చేశాను. న్యాయం చేసేవరకూ పోరాటం ఆపను. నా కుమారుడి పదవి కోసం నేనేదో చేస్తున్నానని అంటున్నారు. ఆ అవసరం నాకేంటి? రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లతో నాది జన్మజన్మల బంధం. అన్నగా వారికి రూ.10 వేలు ఇస్తున్నాను. అవసరమైతే మళ్లీ మళ్లీ ఇస్తా. ఈ అన్నపై ఈగవాలితే తోలు తీస్తామని వారే చెబుతారు' అంటూ ఆయన హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇస్రో మరో ఘనత... జీశాట్ 31 సక్సెస్...