Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ సీఎం మాత్రమే కాదు.. సరిహద్దు సైనికుడు... గొప్ప దేశ భక్తుడు

Advertiesment
జగన్ సీఎం మాత్రమే కాదు.. సరిహద్దు సైనికుడు... గొప్ప దేశ భక్తుడు
, ఆదివారం, 30 మే 2021 (14:59 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏపీ రాష్ట్ర పరిశ్రమలశాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కేవల అధినాయకుడే కాదు.. సరిహద్దు సైనికుడు, గొప్ప దేశ భక్తుడు అంటూ కితాబిచ్చారు. 
 
ఆయన ఆదివారం మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో దేశంలోనే నంబర్ వన్‌గా శ్రీసిటీలో క్రయోజెనిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్‌గా అవతరిస్తుందన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. 
 
'ఆర్ఐఎన్ఎల్' ద్వారా విశాఖపట్నంలో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించామనీ, మొదటి విడతలో భాగంగా ఇవాళ 200 బెడ్లు ప్రారంభించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే శ్రీసిటీని క్రయోజనిక్  మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్‌గా గుర్తించిందన్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా గత నెల రోజులుగా ప్రభుత్వం వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు సామాన్యమైనవి కాదన్నారు. 
 
కరోనా విజృంభన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. రాష్ట్ర  ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలన్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్లు సహా వైద్య సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసినట్టు చెప్పారు. 
 
గత రెండేళ్లుగా కరోనా నియంత్రణ విషయంలో ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ముందు ఉంచడం హర్షణీయమన్నారు. ఇరవై రోజుల ముందు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడిన ఆంధ్రప్రదేశ్ ఇవాళ సర్ ప్లస్‌లో ఉండడం ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా అధికార యంత్రాంగం, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తదితరులకు అభినందనలు తెలిపారు. 
 
దేశానికి ఎక్కువ సంఖ్యలో వ్యాక్సినేషన్ అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్  యూఎస్‌లో ఒప్పందాలు కుదుర్చుకుంటారని చెప్పారు. ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం, టెక్నాలజీని బట్టి ఖర్చు చేస్తామన్నారు. జీజీహెస్ ఆస్పత్రుల్లో శంకుస్థాపన చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌కి అయ్యే ఖర్చు రూ.1.2 కోట్లన్నారు. 
నెల్లూరు జిజిహెచ్‌లో శంకుస్థాపన జరిగిన ఆక్సిజన్ ప్లాంట్‌కి పీఎం కేర్స్ నుంచి నిధులు అందుతాయన్నారు. 
 
ఆత్మకూరులో త్వరలో ఏర్పాటయ్యే ఆక్సిజన్ ప్లాంట్ కు రూ.1.5కోట్లు, జీజీహెచ్లో శంకుస్థాపన చేసిన ఆక్సిజన్ ప్లాంట్, గాలి నుండి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే టెక్నాలజీ, ఆత్మకూరులో రానున్నదని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి ఒక్కరికీ మంచి చేశా.. రాష్ట్రానికి న్యాయం చేశా : ఏపీ సీఎం జగన్