Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్ మాస్ లీడర్.. టీడీపీ నేత నివాళులు

Advertiesment
YS
, సోమవారం, 2 సెప్టెంబరు 2019 (19:32 IST)
వైఎస్ లక్షలాది మంది జీవితాలపై ప్రభావం చూపారని కితాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మాస్ లీడర్ అని టీడీపీ లోక్ సభ సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు.

వైఎస్ తన పాలనతో లక్షలాది మంది ఆంధ్రులపై, దక్షిణ భారతీయులపై ప్రభావం చూపారని కితాబిచ్చారు. వైఎస్ కాంగ్రెస్ నేత అయినప్పటికీ తన పాలన, విధానాలు, పద్ధతుల ద్వారా సంక్లిష్టమైన  వారసత్వాన్ని విడిచిపెట్టి వెళ్లారని వ్యాఖ్యానించారు. వైఎస్ 10వ వర్థంతి సందర్భంగా రామ్మోహన్ నాయుడు ఈరోజు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ మేరకు తెలుగుదేశం నేత ట్విట్టర్ లో స్పందించారు.
 
విజయవాడలో వైఎస్సార్‌ విగ్రహం పున:ప్రతిష్ట
నగరంలోని పోలీసు కంట్రోల్‌ రూమ్‌ సమీపంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పున: ప్రతిష్టించారు. సోమవారం వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

పుష్కరాల పేరుతో నాటి టీడీపీ ప్రభుత్వం విజయవాడ పోలీసు కంట్రోల్‌ రూమ్‌ సమీపంలోని మహానేత విగ్రహాన్ని రాజకీయ కారణాలతో దౌర్జన్యంగా తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అదే ప్రాంతంలో మహానేత విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేసింది. అలాగే కంట్రోల్‌ రూమ్‌ సమీపంలోని ప్రగతి పార్క్‌ను డాక్టర్‌ వైఎస్సార్‌ పార్క్‌గా నామకరణం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొబ్బరి తోటల రైతులకు శుభవార్త