'పళ్లు రాలగొడతా.. నీ పళ్లు రాలిపోతాయి' .. రోజా వర్సెస్ బండ్ల గణేష్ మాటల యుద్ధం (వీడియో)
వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా, సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ల మధ్య మాటలయుద్ధం జరిగింది. వైకాపా అధినేత జగన్‌పై రోజా ఈగవాలనివ్వరు.
వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా, సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ల మధ్య మాటలయుద్ధం జరిగింది. వైకాపా అధినేత జగన్‌పై రోజా ఈగవాలనివ్వరు. అలాగే, జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌కు బండ్ల గణేష్ పరమభక్తుడు. ఆయన్ను ఎవరైనా ఏమన్నా అంటే దుమ్ముదులిపేస్తాడు. అలాంటిది పవన్‌ను రోజా తిడితే ఊరుకుంటాడా? ఇదే జరిగింది.
తాజాగా టీవీ 9 చానెల్ సీనియర్ జర్నలిస్టు రజనీకాంత్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బండ్ల గణేష్ నేరుగా పాల్గొంటే రోజా ఫోనులో అందుబాటులోకి వచ్చారు. ఆ సమయంలో రోజా, బండ్ల గణేష్‌ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలో జరిగింది. వారసత్వ రాజకీయాల గురించి జగన్‌పై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో వారి మధ్య మాటలు శ్రుతిమించాయి. వీరిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి సంభాషణ యధాతధంగా...
బండ్ల గణేష్ : పవన్ కల్యాణ్‌ని మీరు వాడు వీడు అంటే నాకు కోపమొచ్చింది. ఇప్పుడు, కల్యాణ్ బాబుగారని మీరన్నారు. నేనేమి మాట్లాడలేను. నాకు మీరంటే గౌరవం. కల్యాణ్‌ని వాడు, వీడు అని మీరు మాట్లాడతారా?
రోజా: మీరంటే కూడా నాకు గౌరవం ఉంది. ఆవేశపడకండి, వినండి
బండ్ల గణేష్ : కల్యాణ్ బాబు మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా అన్నాడా?
రోజా: పవన్ కల్యాణ్‌ని జగన్‌గారు ఏమైనా అన్నారా? జగన్‌గారిని ఎందుకంటున్నారు?
బండ్ల గణేష్ : జగన్‌గారిని పవన్ కల్యాణ్ ఏమన్నాడమ్మా? పవన్ కల్యాణ్‌ని వాడూవీడూ అని మీరు అనొచ్చా? రెస్పెక్ట్ ఇవ్వండి, మేడమ్.
రోజా: గుర్తుచేసుకోండి. వాడూవీడూ అని ఎవరూ మాట్లాడలేదు. మీరు ఆవేశం తగ్గించుకోండి.
బండ్ల గణేష్ : మీరు మాట్లాడారు.
రోజా: పాయింట్ మాట్లాడటం నేర్చుకోండి
బండ్ల గణేష్ : అవునవును. పాయింట్ మాట్లాడటం రాకే మేము ఎమ్మెల్యేలు కాలేదు. మీకు పాయింట్ మాట్లాడటం వచ్చింది కాబట్టే ఎమ్మెల్యేలు అయ్యారు. రెండు సార్లు ఓడిపోయారు.. ఒకసారి అయ్యారు... మీది గోల్డెన్ లెగ్! దేశం మొత్తం కోడై కూస్తోంది. గోల్డెన్ లెగ్ ఎప్పుడూ వైఎస్ జగన్‌గారితో ఉండి, ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
రోజా: పాలిటిక్స్‌లోకి వస్తే ఇలాగే ఉంటుంది. ఓకే.. ఓకే. గెలిచినా, ఓడినా ప్రజల్లో ఉంటూ కష్టపడుతున్నాం. మీరేమి, నాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు
బండ్ల గణేష్ : రాజశేఖర్ రెడ్డిగారిని పైకి పంపించేశారు, గొప్ప నాయకురాలివి, మహాతల్లివి..
ఈ విధంగా... ఈ క్రమంలో వారి మధ్య సాగిన సంభాషణ తీవ్ర స్థాయికి చేరడంతో 'పళ్లు రాలగొడతా' అని రోజా ఆగ్రహం వ్యక్తం చేయగా, 'నీ పళ్లు రాలిపోతాయి' అంటూ బండ్ల గణేష్ పరస్పరం దూషించుకోవడం జరిగింది. ఇలా వీరి మధ్య వ్యక్తిగత దూషణలు పెరగడంతో రోజా ఫోన్ లైన్ కట్ అయింది.