Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రాధాన్యతల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన... ఆర్థిక మంత్రి యనమల

అమరావతి : ప్రాధాన్యతల ఆధారంగా 2018-19 బడ్జెట్ రూపకల్పన చేయాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు. సచివాలయం 2వ బ్లాక్ లోని ఆర్థిక మంత్రి ఛాంబర్‌లో బుధవారం సాయంత్రం మంత్రి అధ్యక్షతన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముందస్తు బడ్జెట్ సమావేశ

ప్రాధాన్యతల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన... ఆర్థిక మంత్రి యనమల
, బుధవారం, 4 అక్టోబరు 2017 (21:46 IST)
అమరావతి : ప్రాధాన్యతల ఆధారంగా 2018-19 బడ్జెట్ రూపకల్పన చేయాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు. సచివాలయం 2వ బ్లాక్ లోని ఆర్థిక మంత్రి  ఛాంబర్‌లో బుధవారం సాయంత్రం మంత్రి అధ్యక్షతన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముందస్తు బడ్జెట్ సమావేశం జరిగింది. బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. 
 
రాష్ట్రంలో గడచిన మూడేళ్ల సరాసరి వృద్ధి రేటుని, అన్ని శాఖల్లో వేరువేరుగా 3 ఏళ్లలో చేసిన ఖర్చుల ఆధారంగా బడ్జెట్ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. పార్టీ మ్యానిఫెస్టో కాపీలను అన్ని శాఖల కార్యదర్శులకు పంపాలని, అందులో ఇచ్చిన హామీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదుల్లో ఎక్కవ భాగం హౌసింగ్, పెన్షన్లు, లింక్ రోడ్లు, త్రాగునీరుకు సంబంధించినవి ఎక్కువ ఉన్నాయని, వాటిని పరిష్కరించవలసిన అవసరం ఉందని అన్నారు.
 
వివిధ ప్రభుత్వ శాఖల ఆదాయ-వ్యయాలు, అదనపు ఖర్చులు,  ప్రభుత్వం తీసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు, రుణపరిమితి,  కాలుష్యం, చెరువుల మూసివేత, ఉద్యానవన పంటలు, మత్స్య ఉత్పత్తులు, ఉద్యోగుల డీఏ, వాణిజ్య పన్నుల ఆదాయం, పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసే నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు, వెనుకబడిన జిల్లాల నిధులు,  నీటిపారుదల శాఖ వ్యయం, నరేగా నిధులు, రాజధాని నిధులు, రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు.. వంటి పలు సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో  ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిచంద్ర, ప్రత్యేక కార్యదర్శులు హేమా మునివెంకటప్ప, కెవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కనిగిరి బాధితురాలికి అండగా ప్రభుత్వం... రూ.10 లక్షలు డిపాజిట్, ఇల్లు కూడా...