Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇళ్లు ఇచ్చేది లేదు.. ఏం చేసుకుంటావో చేసుకో!: వైకాపా ఎమ్మెల్యే అసహనం

Advertiesment
ycp mla kannababu
, ఆదివారం, 16 జులై 2023 (11:36 IST)
'ఇళ్ల పట్టాలిచ్చేది లేదు.. ఏం చేసుకుంటావో చేసుకో' అంటూ యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి రాజు (కన్నబాబు) సీపీఎం నాయకుడు సత్యనారాయణపై అసహనం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే తీరుపై సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వెంకటాపురంలో శనివారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. 
 
గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలు 94 మందిని గుర్తించారని, జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని సీపీఎం నాయకుడు సత్యనారాయణ విమర్శించారు. అలాంటప్పుడు జగనన్న సురక్ష పథకం ఎందుకని ప్రశ్నించారు.
 
ఈ మాటలకు ఎమ్మెల్యేకు ఆగ్రహం వచ్చింది. ఇటీవల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలు తెలుసుకొన్నామని, 15 మంది మాత్రమే లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారులకు లేని సమస్య మీకెందుకని ప్రశ్నించారు. ఇళ్లు ఇచ్చేదిలేదు.. ఏం చేసుకుంటావో.. చేసుకో.. అంటూ అని అసహనం వ్యక్తం చేశారు. అర్హులందరికీ న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామని సీపీఎం నాయకుడు స్పష్టం చేశారు. 
 
కుమార్తె వరుసయ్యే యువతిని గర్భవతిని చేసిన బాబాయ్ 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. కుమార్తె వరుసయ్యే యువతిని కామంతో కళ్ళు మూసుకునిపోయిన వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి గర్భవతిని చేశాడు. ఈ దారుణం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో జరిగింది. దీనిపై బాధితురాలు మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆశ్రయించగా వెలుగులోకి వచ్చింది. 
 
అయితే, పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఈ దారుణం జరిగిన ప్రాంతం తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని తెలియడంతో అక్కడకు బదిలీ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమార్తె వరుసయ్యే యువతిని గర్భవతిని చేసిన బాబాయ్.. ఎక్కడ?