Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా రైతుకు భారీ విలువ చేసే వజ్రం

Advertiesment
మహిళా రైతుకు భారీ విలువ చేసే వజ్రం
, సోమవారం, 28 జూన్ 2021 (11:23 IST)
గతంలో ఓ రైతుకు భారీ విలువ చేసే వజ్రం లభ్యమైన సంగతి తెలిసిందే. తాజాగా పొలం పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీకి వజ్రం లభ్యమైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళ శనివారం పొలంలో కూలి పనులకు వెళ్లింది.

అక్కడ పనులు చేస్తుండగా వజ్రం లభ్యమైనట్లు సమాచారం. నాలుగున్నర క్యారెట్లు ఉన్న ఆ వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ.6.50 లక్షలు, 2 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో ఏటా తొలకరి వర్షాలకు వజ్రాలు లభ్యమవడం సహజం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగ్లా రాజధాని ఢాకాలో పేలుడు - ఏడుగురు మృతి