Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెడ్‌పై ప్రేయసితో రసపట్టులో ఉన్న భర్త.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

Advertiesment
బెడ్‌పై ప్రేయసితో రసపట్టులో ఉన్న భర్త.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
, శనివారం, 2 ఫిబ్రవరి 2019 (15:06 IST)
ఉద్యోగ రీత్యా భార్య మరో రాష్ట్రంలో నివసిస్తోంది. భార్య పంపించే డబ్బులతో జీవనంసాగించే భర్త.. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత రామాంతపూర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో రెండో కాపురం పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ రోజున భార్య ఉన్నట్టుండి ప్రత్యక్షమై... తన భర్త పరాయి మహిళతో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ సమయంలో అయ్యగారు.. ఆ మహిళతో మాంచి రసపట్టులో ఉన్నాడు. భార్యను చూడగానే ఒకింత షాక్‌కు గురైన భర్త.. ఆ తర్వాత తేరుకుని ఆమెపై తిట్లదండకం మొదలుపెట్టాడు. హైదరాబాద్ నగరంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ ఉప్పల్ నగరానికి చెందిన కృష్ణమాచారి అనే వ్యక్తి క్రిమినల్ లాయర్‌గా ఉన్నాడు. ఈయన భార్య వింధ్యరాణి. రాజస్థాన్‌లో వైద్యాధికారిగా పని చేస్తోంది. దీంతో ఈమె నెలకు ఒకసారి భర్త వద్దకు వచ్చి వెళుతుండేది. ఈ క్రమంలో కృష్ణమాచారి ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తమ వ్యవహారం గుట్టుగా సాగేందుకు వీలుగా రామాంతపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆమెతో కలిసి కాపురం పెట్టాడు. 
 
ఈ నేపథ్యంలో వింధ్యారాణి ఇటీవల వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని నగరానికి వచ్చింది. ఇక్కడకు వచ్చాక భర్త ప్రవర్తనలో మార్పును గమనించి, ఆయన్ను అనుసరిస్తూ వచ్చేంది. ఈ క్రమంలో ఓ రోజున తన భర్త రామాంతపూర్‌లోని ఇంటో మరో మహిళతో పడక గదిలో ఉండగా, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. భార్యను చూసిన కృష్ణమాచారి ఒకింత షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత తేరుకుని ఆమెపై నోరు పారేసుకున్నాడు. ఆ తర్వాత స్థానికుల సహకారంతో భర్తను పోలీసులకు అప్పగించింది. దీనిపై కేసు నమోదు చేసిదర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆటో డ్రైవర్‌గా చంద్రబాబు... మున్ముందు ఎలక్ట్రిక్ వాహనాలే...