Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డాక్టర్‌తో అక్రమ సంబంధం : భర్తకు నరాల వీక్నెస్ ఇంజెక్షన్ వేసిన భార్య

Advertiesment
డాక్టర్‌తో అక్రమ సంబంధం : భర్తకు నరాల వీక్నెస్ ఇంజెక్షన్ వేసిన భార్య
, శనివారం, 2 ఫిబ్రవరి 2019 (12:07 IST)
అక్రమ సంబంధాలు ఎంతటి అఘాయిత్యానికైనా పాల్పడేలా పురిగొల్పుతున్నాయి. ముఖ్యంగా కట్టుకున్న భర్తను ఏమాత్రం కనికరం లేకుండా భార్యలు హత్య చేస్తున్నారు. తాజాగా, వివాహిత ఒకరు డాక్టరుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. కట్టుకున్న భర్తతో సంసారం చేస్తూనే... డాక్టరుతో ఎంజాయ్ చేయాలని భావించింది. ఇందుకోసం భర్తను దాంపత్య జీవితంలో బలహీనుడుని చేసేలా ప్లాన్ వేసింది. ఇందుకోసం నరాలు బలహీనపడేలా భర్తకు ఇంజెక్షన్ వేసింది. ఈ దారుణం ప్రకాశం జిల్లా కంభం అర్థవీడు మండలంలోని నాగులవరంలో వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రకాశం జిల్లా కంభం అర్ధవీడు మండలం నాగులవరానికి చెందిన జగన్ అనే యువకుడు కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. జేసీబీలు, ట్రాక్టర్లు, డ్రోజర్లు అద్దెకిస్తూ కంభం ఏరియాలో నివసిస్తున్నాడు. అతని భార్య రజనీ పక్కింట్లో ఉన్న డాక్టర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో దాంపత్య పరంగా భర్తను బలహీన పరచాలని భార్య నిర్ణయించుకుంది. ఇందుకోసం తన ప్రియుడైన డాక్టరు ద్వారా నరాలు బలహీనపడే ఇంజెక్షన్ వేయంచింది. 
 
అదేసమయంలో భర్త అడ్డుకూడా తొలగించుకోవాలని భావించారు. ఇందుకోసం మరో స్కెచ్ వేశారు. ఇందులోభాగంగా మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి డాక్టర్ ఇంటికి వచ్చాడు. తాను కర్నూలు జిల్లాలో పోలీసు కానిస్టేబుల్ అని పరిచయం చేసుకున్నాడు. వివాదాన్ని పరిష్కరిస్తానంటూ నమ్మబలికి జగన్‌ని కారులో ఎక్కించుకుని వెళ్లాడు. ఆ తర్వాత జగన్ జాడ తెలియరాలేదని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
చివరగా ఇంటికి వచ్చిన వ్యక్తితో జగన్ కారులో బయటకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా తెలుస్తోంది. మార్గమధ్యంలో డాక్టరు కూడా ఎక్కాడు. ముగ్గురూ రావిపాడు రోడ్డు మీదుగా గొట్లగట్టు వైపు వెళ్లారు. ఆ తర్వాతి రోజు డాక్టర్ తిరిగి రజనీ వద్దకు వచ్చినట్లు సీసీటీవీలో రికార్డైంది. కొడుకు ఆచూకీ కోసం జగన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు డాక్టర్ కాల్‌డేటా ఆధారంగా చేసుకుని అతడే జగన్ కిడ్నాప్‌కి ప్రణాళిక రచించాడని నిర్ధారించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో.. అతివేగంగా వెళ్తున్న లారీకి ముందు ఆవు వచ్చి నిలబడింది.. (వీడియో)