Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నాం: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నాం: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్
, శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:55 IST)
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ సచివాలయంలోని ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ లో హాల్ లో నిర్వహించారు.

పాలనలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వంతో కలిసి పనిచేశారని కొనియాడారు. నాన్ ఫైనాన్స్ సమస్యలను సంబంధిత శాఖలతో మాట్లాడి తక్షణమే పరిష్కారిస్తామన్నారు.

ఆర్థిక సంబంధమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మహిళా ఉపాధ్యాయుల మాదిరిగా అన్ని శాఖల మహిళా ఉద్యోగులకు 5 రోజుల సెలవు దినాలు మంజూరుకు కృషి చేస్తామన్నారు. అమ్మఒడి పథకాన్ని అందరికీ వర్తింపజేస్తామని, విద్యార్థుల తల్లులు నిరుత్సహపడొద్దని సీఎం ఆదిత్యనాథ్ దాస్ భరోసా ఇచ్చారు.

పీఆర్సీపై త్వరలో రిపోర్టు అందజేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలపై జాయింట్ కౌన్సిల్ కమిటీ సమావేశం ఏప్రిల్ లో నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, విద్యావ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఉద్యోగులను సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తారన్నారు.

తమ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకాల అమలులో ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో ప్రభుత్వానికి వారందించిన సహాయ సహకారాలు మరువలేనివన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు.

మరో సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ మాట్లాడుతూ, ఉద్యోగులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇప్పటికే సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలర్ చేయడంపై కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా?