Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బాబు సర్కారు యూటర్న్? డీసీలో ప్రత్యేక కథనం.. మండిపడిన టీడీపీ శ్రేణులు!!

Advertiesment
margani bharath

వరుణ్

, గురువారం, 11 జులై 2024 (09:38 IST)
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో ఆంధ్రా ప్రాంత ప్రజల భావోద్వేగాలతో ముడిపిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు వేస్తుంది. అయితే, గత వైకాపా ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఏమాత్రం చర్యలు చేపట్టలేదు. కానీ, విపక్ష పార్టీలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో వైకాపా ప్రభుత్వం దిగిపోయింది. టీడీపీ సారథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌పై యూటర్న్ తీసుకుందంటూ ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్‌లో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇది రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ కథనంపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య కథనాలను ఎలా రాస్తారంటూ మండిపడుతున్నారు. ఆ సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కార్యాలయ నేమ్ బోర్డుకు నిప్పంటించారు. 
 
ఈ వ్యవహారంపై విశాఖ టీడీపీ ఎంపీ మార్గాని భరత స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు రాయడం సరికాదని హితవు పలికారు. "చంద్రబాబు కానీ, ఇక్కడ ఎంపీగా నేనుగానీ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గానీ, ఎమ్మెల్యేలుగా పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రేమేశ్ గానీ ఎపుడైనా ఏమైనా అన్నారా? ఏ ఆధారం లేకుండా ఇంగ్లీషు మీడియా ఆ విధంగా రాయడం బాధ్యతా రాహిత్యం. ఇద చాలా మంది జీవితాలతో ముడిపడిన అంశం. అలాంటి తీవ్రమైన విషయాన్ని ఏదో తేలిగ్గా రాసేయడం అంత కరెక్ట్ కాదు. ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంపై మేం చర్యలు తీసుకుంటాం" అని ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్లోబల్ ఐటి సెంటర్, మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్- ఇన్నోవేషన్ సెంటర్‌ను ఆవిష్కరించిన తెలంగాణ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు