Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయండి.. కేంద్రానికి బీజేపీ ఎంపీల వినితి!!

bjp mps

వరుణ్

, గురువారం, 27 జూన్ 2024 (09:20 IST)
విశాఖపట్టణంలోని ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని ఏపీకి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు వారు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖామంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసి వినతిపత్రం సమర్పించారు. బుధవారం ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నాయకత్వంలో బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కలిశారు. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. వారి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. 
 
ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్‌ను లాభాలబాట పట్టించే అంశాలపై బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రితో చర్చించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను కూడా సమర్పించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకునిరావాలని వారు కోరారు. బీజేపీ ఎంపీల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి... మరోమారు సమావేశమవుదామని వారికి హామీ ఇచ్చారు. కాగా, కేంద్ర మంత్రిని కలిసినవారిలో దగ్గుబాటి పురంధేశ్వరి తో పాటు.. నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌లు తదితరులు ఉన్నారు. 
 
ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. పౌరులకు భారత్ హెచ్చరిక! 
 
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన కెన్యాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొనివున్నాయి. ఆ దేశ పాలకులు పన్నులను పెంచారు. పన్నుల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా కెన్యాలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. మంగళవారం కెన్యా పార్లమెంట్‌ను ముట్టడించేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. అయితే పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు ఆందోళనకారులు చనిపోయారు. డజన్ల సంఖ్యలో గాయాలపాలయ్యారు. పార్లమెంటు భవనంలోని కొన్ని విభాగాలు ధ్వంసమయ్యాయి. తీవ్ర ఆందోళన నేపథ్యంలో పార్లమెంట్‌లో పన్నుల పెంపు బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో కెన్యాలో ఆందోళనలకు మరింత అవకాశం ఉంది. ప్రస్తుతం కెన్యాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొనివున్నాయి. 
 
ఈ పరిస్థితులను బేరీజు వేసిన కెన్యాలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేకుంటే బయటకు రావొద్దని సూచించింది. ఈ మేరకు మంగళవారం అడ్వైజరీని జారీ చేసింది. 'ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కెన్యాలోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేకుంటే బయటకు రావొద్దు. పరిస్థితులు చక్కబడే వరకు నిరసనలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకండి' అని కెన్యాలోని భారత కాన్సులేట్ ట్విట్టర్ వేదికగా అడ్వైజరీ ఇచ్చింది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కెన్యాలోని భారతీయులందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇక కెన్యాలో నివసిస్తున్న భారత పౌరులు స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించింది. ఇక అప్డేట్స్ కోసం భారత కాన్సులేట్ మిషన్ వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఫాలో కావాలని సూచన చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింగపూర్ నుంచి 'డిస్నీ క్రూయిజ్ లైన్' నౌకలో సముద్రయానం-2025లో ప్రారంభం