Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజ‌య‌వాడ రాజీవ్ గాంధీ పార్క్ ఆధునీకరణ పనుల ప్రారంభం

విజ‌య‌వాడ రాజీవ్ గాంధీ పార్క్ ఆధునీకరణ పనుల ప్రారంభం
విజ‌య‌వాడ‌ , బుధవారం, 8 డిశెంబరు 2021 (20:25 IST)
విజ‌య‌వాడ‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన రాజీవ్ గాంధీ పార్కులో చేపట్టిన ఆధునీకరణ పనుల పురోగతిని బుధవారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి పర్యవేక్షించారు. పార్క్ ఆవరణలో జరుగుతున్న పనుల వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. సత్వరమే సందర్శకులకు అందుబాటులో ఉండేలా పార్క్ లో జరుగుతున్న ఇంజనీరింగ్, గ్రీనరీ ఆధునీకరణ పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

 
పార్క్ లో పిల్లల ఆట పరికరాల ఏర్పాటు పనులు పరిశీలిస్తూ, ఇంకా చేపట్టవలసిన పనులను వెనువెంటనే చేయాల‌న్నారు. పార్క్ ఆవరణలో సందర్శకులకు అందుబాటులో ఉండేలా మరుగుదొడ్లు,   త్రాగునీటి సౌకర్యం కల్పనపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. 

 
అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభ కార్యక్రమానికి  సంబంధించిన ఏర్పాట్లును జిల్లా కలెక్టర్, కమిషనర్ అధికారులతో కలసి పరిశీలించారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.గీతాభాయి, అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ బి.దయాకర్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురబలకోట వాసి మృతి