Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలిపిరి నుంచి తిరుమల వరకు నడకదారి ప్రారంభించిన సీఎం జ‌గ‌న్

అలిపిరి నుంచి తిరుమల వరకు నడకదారి ప్రారంభించిన సీఎం జ‌గ‌న్
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 12 అక్టోబరు 2021 (10:56 IST)
తిరుమల పర్యటనకు వ‌చ్చిన సీఎం జ‌గ‌న్ అలిపిరి వద్ద  ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి,  న‌డక మార్గాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గత కొద్దికాలంగా భక్తులు ప్రవేశం ఆపి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 25 కోట్లుతో అలిపిరి నుంచి తిరుమల వరకు వున్న రహదారికి పైకప్పు నిర్మించారు. పునర్నిర్మించిన పైకప్పు వైష్ణవ సాంప్రదాయంలో అనన్య శరణాగతికి ప్రతీకగా నిలిచిన శ్రీవారి భక్తుల నడకదారి విశేషాలను డిజిటల్ స్క్రీన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి  చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వివ‌రించారు.
 
 
ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ చీఫ్ ఫైనాన్స్ అధికారి సచిన్ మర్దికర్, సర్కిల్ ప్రాజెక్ట్ హెడ్ ఎ.పి. ఎవిఎస్ఎస్ రావు, జిల్లా ఇన్చార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ గురుమూర్తి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిధున్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి,  శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి. మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటి మేయర్  భూమన అభినయ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, టిటిడి  ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహర్ రెడ్డి, అడిషనల్ ఇఓ ధర్మారెడ్డి,  జెఈవో శ్రీమతి సదా భార్గవి, చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి గోపీనాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమ్మూలో ఎదురుకాల్పులు-ముగ్గురు ఉగ్రవాదులు హతం