Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'తండ్రితో పేడ అమ్మాయి '.. పేడకళ్లు ఎత్తిన స్టార్ హీరో భార్య!

Advertiesment
Upasana Konidela
, గురువారం, 14 మే 2020 (21:09 IST)
ఆమె ఓ స్టార్ హీరో సతీమణి. అంతకుముందు ఓ యువ మహిళా పారిశ్రామికవేత్త. అపోలో ఆస్పత్రి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న యువతి. ఇప్పటికే ఆమె ఎవరో మీకు అర్థమైవుంటుంది. ఆమె ఎవరో కాదు.. ఉపాసన కొణిదెల. ఓ రాయల్ ఫ్యామిలీకి చెందిన యువతి అయినప్పటికీ.. మచ్చుకైనా అలాంటి ఛాయలను ఆమెను కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఎంతో మందికి ఆపన్న హస్తం అందిస్తోంది. అనేక మందికి పేదలకు అపోలో ఆస్పత్రిలో ఉచిత వైద్యం కూడా అందించారు.
webdunia
 
అలాంటి ఉపాసన ఇపుడు పేడ కళ్లు ఎత్తారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన తండ్రితో కలిసి తమ ఫార్మ్‌హౌస్‌లో ఉల్లాసంగా గడిపిన చెర్రీ భార్య.. ఆమె ఆవు పేడను ఎత్తి ఫొటోలకు పోజు ఇచ్చారు. కాసేపు ఆవు, దూడలతో మమేకమయ్యారు.
webdunia
 
ఈ సందర్భంగా తనను తాను ఓ ఆధునిక తరం రైతుగా అభివర్ణించుకున్నారు. 'తండ్రితో పేడ అమ్మాయి' అంటూ సరదాగా ట్వీట్ చేశారు. "ఆర్గానిక్ (సేంద్రియ) వ్యవసాయం ఎలాగో నేర్చుకుంటున్నాను. ఎరువు తయారుచేయడం, ఆహార వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ఎలాగో తర్ఫీదు అందుకుంటున్నాను. రమణీయమైన సుస్థిర జీవనాన్ని ఆకళింపు చేసుకుంటున్నాను" అంటూ ఉపాసన ట్విట్టర్లో స్పందించింది. ఈ ట్వీట్ వైరల్ కావండతో అనేక నెటిజన్లు సూపర్బర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రకాశం జిల్లా ట్రాక్టర్ ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన గవర్నర్