Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోడెలను అతనే హత్య చేశాడు.. మేనల్లుడు కంచేటి ఆరోపణలు

Advertiesment
కోడెలను అతనే హత్య చేశాడు.. మేనల్లుడు కంచేటి ఆరోపణలు
, సోమవారం, 16 సెప్టెంబరు 2019 (17:33 IST)
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపట్ల ఆయన మేనల్లుడు కంచేటి సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం కోడెల కుమారుడు శివరామే ఈ హత్య చేశాడని ఆరోపించారు. ఈ మేరకు సత్తెనపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. శివారం తనను శారీరకంగా, మానసికంగా చాలాకాలం నుంచి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని కోడెల తనతో చాలాసార్లు చెప్పారన్నారు. 
 
కోడెలకు ఆత్మహత్య చేసుకునే అవసరం లేదని.. శివరామే తండ్రిని హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోడెల మరణంపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరపాలని కోడెల మేనల్లుడు సాయి కోరారు.
 
మరోవైపు కోడెల అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో మూడు బృందాలతో దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత శివప్రసాద్‌రావు మృతిపై స్పష్టత వస్తుందన్నారు. క్లూస్ టీం, టెక్నికల్ బృందాలు కూడా దర్యాప్తు చేస్తున్నాయని సీపీ పేర్కొన్నారు. 
 
పోస్టుమార్టం నిమిత్తం శివప్రసాద్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురికీ తరలించారు. హైదరాబాద్‌లోని కోడెల నివాసంలో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిక్ టాక్‌పై పిచ్చి మహాముదురు.. జాగ్రత్త సుమా!