Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకన్న బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Advertiesment
Tummalagunta Sri Kalyana Venkanna
, గురువారం, 7 అక్టోబరు 2021 (06:46 IST)
తిరుపతి, తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి 14వ వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అత్యంత శాస్త్రోక్తంగా బుధవారం రాత్రి అంకురార్పణ జరిగింది. వేద పండితులు, అర్చకులు వేద మంత్రోచ్ఛారణ నడుమ భక్తిశ్రద్ధలతో విశ్వక్సేన ఆరాధన చేపట్టారు.

బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కంకణ బట్టర్ గా ప్రధాన అర్చకులు గిరిధర భట్టాచార్యులు వ్యవహరిస్తున్నారు. అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా వినాయకస్వామి ఆలయంలో మేధినీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. 

అక్కడి నుంచి విశ్వక్సేన సమేత కల్యాణ వెంకన్న ఊరేగింపుగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అర్చకులు యాగశాలలో ఆరాధన కార్యక్రమం నిర్వహించి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను శ్రీనివాసుని అవతార నక్షత్ర మైన శ్రవణా నక్షత్రం నాటికి ఉత్సవాలు పరిసమాప్తమయ్యేలా ఆగమ పండితులు ముహూర్తం నిర్ణయించారు. 
 
గురువారం ధ్వజారోహణం
శ్రీకల్యాణ వెంకన్న స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు తుమ్మలగుంట ముస్తాబైంది. ముక్కోటి దేవతలను,  భక్తకోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గురువారం సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం పెద్ద శేషవాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

కోవిడ్ నిబంధనల మేరకు బ్రహ్మోత్సవం నిర్ణయించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ దీపాల అలంకరణలతో తుమ్మలగుంట గ్రామం అత్యంత వేడుకగా ముస్తాబైంది.

కరోనా నేపధ్యంలో నవరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలను నాలుగు మాడ వీధులకు పరిమితం చేశారు. ఈ మేరకు కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆలయ సిబ్బంది కి ఎమ్మెల్యే చెవిరెడ్డి సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేద గిరిజన వైద్య విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకి కేటీఆర్ ఆర్థిక సహకారం