Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

Advertiesment
laddu

ఠాగూర్

, బుధవారం, 4 డిశెంబరు 2024 (11:50 IST)
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుపతి తిరుమల దేవస్థానం కొత్త పాలక మండలి త్వరలోనే శుభవార్త చెప్పనుంది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. శ్రీవారిని దర్శనం చేసుకునే భక్తులు అడిగినన్న లడ్డూ ప్రసాదాలను ఇచ్చేలా చర్యలు చర్యలు తీసుకోనుంది., 
 
తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైనదిగా ఉన్న విషయం తెల్సిందే. భక్తిశ్రద్ధలతో తాము ఆరగించడమే కాకుండా ఇరుగుపొరుగు వారికి కూడా పంచుతుంటారు. అందుకే తిరుమల వెళ్లినప్పుడు అవసరమైన సంఖ్యలో లడ్డూలు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. 
 
కానీ తితిదే పరిమితి కారణంగా నిరాశే ఎదురవుతోంది. అయితే మున్ముందు భక్తులు అడిగినన్ని లడ్డూలు విక్రయించేందుకు టీటీడీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు అదనపు లడ్డూల తయారీకి కావాల్సిన పోటు సిబ్బందిని భర్తీ చేసుకునేందుకు అడుగులు వేస్తోంది.
 
భక్తుల డిమాండు దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఈ దిశగా కదులుతోంది. ఇందుకోసం మరో 74 మంది శ్రీవైష్ణవులు, 10 మంది శ్రీవైష్ణవేతరులను నియమించాలని నిర్ణయించింది. వీరి సాయంతో రోజుకు అదనంగా 50 వేల చిన్న లడ్డూలు, 4 వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
కాగా ప్రస్తుతానికి సాధారణ రోజుల్లో లడ్డూ విక్రయాల్లో పెద్దగా ఇబ్బందులు లేవు. అయితే వారాంతాలు, ప్రత్యేక రోజు, బ్రహ్మోత్సవాల వేళల్లో లడ్డూలకు ఎక్కువ గిరాకీ ఉంటోంది. అందుకే అదనపు తయారీకి టీటీడీ నిర్ణయించింది. 
 
కాగా దర్శనం చేసుకున్న భక్తులకు ప్రస్తుతం ఒక చిన్న లడ్డూను ఉచితంగా అందిస్తున్నారు. సరాసరిన 70 వేల మంది ప్రతి రోజూ శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అంటే రోజుకు 70 వేల ఉచిత లడ్డూలు ఇవ్వాల్సి ఉంటుంది. అదనపు తయారీ అందుబాటులోకి వస్తే అదనపు లడ్డూ ప్రసాదం కోరుకునే భక్తులకు విక్రయిస్తుంటారు.
 
కాగా టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6 వేల పెద్ద లడ్డూలు (కల్యాణం లడ్డూ), 3,500 వడలను తయారు చేస్తోంది. వీటిని తిరుమలతో సహా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ విక్రయిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గత 20 ఏళ్లలో తొలిసారిగా తెలంగాణలో భూప్రకంపనలు.. ములుగు జిల్లాలో?