Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీటీడీ సహాయాన్ని కొనసాగించాలి: సీపీఐ

Advertiesment
TTD
గతంలో ప్రకటించినట్లుగా టీటీడీ సహాయాలు కొనసాగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం లేఖ రాశారు.

లేఖలోని వివరాలు.. ''కరోనా విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ప్రతీ జిల్లాకు రూ.ఒక కోటి చొప్పున ఇస్తామని, పలు ప్రాంతాల్లో ఆహార సదుపాయాలను కల్పిస్తామని ఇటీవల టిటిడి ప్రకటించింది.

(నిన్న) గురువారం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా కడుపునిండా తిండి లేక, నిలువ నీడ లేక పేదలు, వలస కూలీలు, సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు.

ఏ మతానికి చెందిన దేవుడైన ప్రజాహితం కోరిన వారే. తక్షణం గతంలో ప్రకటించిన విధంగా 13 జిల్లాలకు జిల్లాకు రూ.ఒక కోటి చొప్పున నిధులు విడుదల చేయగలరు.

పలుచోట్ల టిటిడి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆహార పంపిణీ కార్యక్రమాన్ని కూడా కొనసాగించగలరు '' అని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కచెల్లెమ్మల చిరునవ్వులు చూడటమే లక్ష్యం: కోన రఘుపతి