Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జనతా కర్ఫ్యూను పట్టించుకోవద్దు.. జనం రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలి!

జనతా కర్ఫ్యూను పట్టించుకోవద్దు.. జనం రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలి!
, సోమవారం, 23 మార్చి 2020 (08:40 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్‌ను పట్టించుకోవద్దని, ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలంటూ ఓ కౌన్సిలర్ పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా జనతా కర్ఫ్యూను ఆదివారం పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వగా దేశ ప్రజలంతా అలానే చేశారు. అయితే, సంగారెడ్డి జిల్లాలో ఓ కౌన్సిలర్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి గృహనిర్బంధంలో ఉంచారు. 
 
పట్టణంలోని 34వ వార్డు కౌన్సిలర్ అయిన షమీ (తెరాస) సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెనక్కి తీసుకునేంత వరకు ప్రధాని నరేంద్ర మోడీ మాటలను పట్టించుకోవద్దని, జనతా కర్ప్యూను పట్టించుకోకుండా అందరూ రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలని ఆ వీడియోలో పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన షమీపై కేసు నమోదు చేసి గృహనిర్బంధంలో ఉంచినట్టు  సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కరోనా వైరస్' డ్రాగన్ కంట్రీ కుట్రే? చైనా చేతిలో కరోనా టీకా? విశ్లేషకులు వాదన!!