Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీవిత గురించి నావద్ద ఆధారాలున్నాయంటోన్న‌ సంధ్య(Jeevitha Video)

సినీ న‌టి జీవిత త‌న భ‌ర్త రాజ‌శేఖ‌ర్ ద‌గ్గ‌ర‌కు త‌నే అమ్మాయిల‌ను పంపిస్తుంది అంటూ సామాజిక కార్య‌క‌ర్త సంధ్య చేసిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ వ్యాఖ్య‌లపై జీవిత స్పందిస్తూ... సంధ్య ఏ ఆధారాల‌తో మాపై ఇలాంటి వ్యాఖ్య‌లు చేసిందో అర్ధం కావ‌డం లేదు. ఆమ

Advertiesment
Tollywood casting couch
, బుధవారం, 18 ఏప్రియల్ 2018 (20:06 IST)
సినీ న‌టి జీవిత త‌న భ‌ర్త రాజ‌శేఖ‌ర్ ద‌గ్గ‌ర‌కు త‌నే అమ్మాయిల‌ను పంపిస్తుంది అంటూ సామాజిక కార్య‌క‌ర్త సంధ్య చేసిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ వ్యాఖ్య‌లపై జీవిత స్పందిస్తూ... సంధ్య ఏ ఆధారాల‌తో మాపై ఇలాంటి వ్యాఖ్య‌లు చేసిందో అర్ధం కావ‌డం లేదు. ఆమె పైన‌, ఆ వార్త‌ల‌ను ప్ర‌సారం చేసిన న్యూస్ ఛాన‌ల్ పైన కేసు పెట్ట‌బోతున్నాను. కోర్టులోనే తేల్చుకుంటాను అంటూ సంధ్య పై ఫైర్ అయ్యారు జీవిత‌.
 
ఈ నేపథ్యంలో సంధ్య స్పందిస్తూ, తాను చేసిన వ్యాఖ్యలకు తగిన ఆధారాలు ఉన్నాయని, బాధిత యువతులే తన దగ్గరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. ఇంకా చాలా విషయాలు చెప్పారని, అవన్నీ చెబితే చాలా అసహ్యంగా ఉంటుందని అన్నారు. 
 
ఇది కేవలం జీవిత, తన మధ్య జరుగుతున్న యుద్ధం కాదని చెప్పిన సంధ్య, సినీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ లేదని, కమిట్‌మెంట్ సిస్టమ్ లేదని జీవిత మాట్లాడటం కరెక్టు కాదనే దృష్టితోనే తాను ఆ వ్యాఖ్యలు చేశాను అన్నారు. జీవిత అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని, తమ పోరాటం ఎప్పుడూ మహిళల పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు. మ‌రి... ఈ కేసు ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో..? కోర్టు ఏమ‌ని తీర్పు ఇస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెంప నిమిరిన జర్నలిస్టుకు సారీ చెప్పిన తమిళనాడు గవర్నర్