Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇక నేరస్తులు తప్పించుకోలేరు.. వీడియోలు, ఫోటోలు సాక్ష్యాధారాలు కానున్నాయట!

మొబైల్‌లో తీసుకునే ఫోటోలు, వీడియోలు కీలకం కానున్నాయి. ఇప్పటిదాకా కోర్టులు వీటిని సాక్ష్యాధారాలుగా పరిగణించట్లేదు. అయితే ప్రస్తుతం ''ఎవిడెన్స్ యాక్ట్, 1872''ను సవరించి.. మొబైల్‌లో తీసిన ఫోటోలు, వీడియోల

ఇక నేరస్తులు తప్పించుకోలేరు.. వీడియోలు, ఫోటోలు సాక్ష్యాధారాలు కానున్నాయట!
, శనివారం, 20 జనవరి 2018 (11:53 IST)
మొబైల్‌లో తీసుకునే ఫోటోలు, వీడియోలు కీలకం కానున్నాయి. ఇప్పటిదాకా కోర్టులు వీటిని సాక్ష్యాధారాలుగా పరిగణించట్లేదు. అయితే ప్రస్తుతం ''ఎవిడెన్స్ యాక్ట్, 1872''ను సవరించి.. మొబైల్‌లో తీసిన ఫోటోలు, వీడియోలు ప్రాథమిక సాక్ష్యాలుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. 
 
ఉత్తరప్రదేశ్‌లో షహరాన్‌పూర్‌లో జరిగిన జాట్ల అలర్లు, రోహ్‌తక్ ఘటన, దళిత వ్యతిరేక అల్లర్ల విషయంలో భద్రతా దళాల లోపంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాలను కేంద్రం అభిప్రాయాలను కోరింది. 
 
ఇందులో భాగంగా సెల్ ఫోన్ ద్వారా తీసిన ఫోటోలు, సీసీ టీవీల్లో రికార్డ్ అయిన వీడియోలను కూడా ''ఎవిడెన్స్ యాక్ట్, 1872’ ప్రకారం సాక్ష్యాధారాలుగా పరిగణించాలి. క్రిమినల్ పీనల్ కోడ్/ఎవిడెన్స్ యాక్ట్‌ను ఈ మేరకు సవరించాలి'' అని ప్రతిపాదనలో పేర్కొనడం జరిగింది. ఈ సవరణలకు ఆమోదం లభించి చట్టంలో చేర్చితే నేరస్తులు తప్పించుకునే వీలుండదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీ-కమల్ ఎంట్రీ.. ప్రజలు ఎవరికి ఓటేస్తారో చెప్పలేం: విశాల్