Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టైఫాయిడ్ జ్వరం వస్తే.. కరోనా అనుకుని.. ముగ్గురు ఆత్మహత్య.. ఎక్కడ?

టైఫాయిడ్ జ్వరం వస్తే.. కరోనా అనుకుని.. ముగ్గురు ఆత్మహత్య.. ఎక్కడ?
, శనివారం, 15 మే 2021 (19:10 IST)
కరోనా కాలంలో జ్వరం అంటేనే జనం జడుసుకుంటున్నారు. ఈ భయం ప్రాణాల్ని తీసేస్తోంది. అదే జరిగింది ఏపీలోని ఉత్తరాంధ్రా జిల్లా అయిన విజయనగరంలో. ఒకే కుటుంబంలో ముగ్గురికి జ్వరం వచ్చింది. అది టైఫాయిడ్ జ్వరం. కానీ అది కరోనా వల్లే వచ్చిందనే భయంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లాలోని వేపాడ మండలంలోని నల్లబిల్లిలో చోటుచేసుకుంది.
 
శుక్రవారం జరిగిన ఈ ఘటన నల్లబిల్లి గ్రామంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. ఉడత సత్యనారాయణ గుప్తా అనే 62 వ్యక్తి రెండు సంవత్సరాలుగా విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గుప్తా భార్య 2002లో మరణించడంతో, 2009లో గుంటూరుకు చెందిన సత్యవతి వివాహం చేసుకున్నాడు. 
 
గుప్తాకు అత్త వెంకటసుబ్బమ్మ, కుమారుడు సంతోష్, కుమార్తె పూర్ణ ఉన్నారు. గుప్తా కొడుకు తెలంగాణలోని నిజామామాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నాడు. కూతురు వివాహం అయిపోయింది. ఓ పేపరు ప్రకటన చూసి గుంటూరుకు చెందిన సత్యవతిని గుప్తా రెండో వివాహం చేసుకున్నాడు.
 
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం గుప్తా సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుంటే టైఫాయిడ్ అని తేలింది. దీంతో మందులు వాడుతున్నారు. అలా గత రెండు రోజుల క్రితం భార్య సత్యవతికి కూడా జ్వరం వచ్చింది. దీంతో వారిని చూసుకునేందుకు చుక్కపల్లిలో ఉంటున్న కుమార్తె వచ్చింది. కానీ కూతురికి కూడా జ్వరం వస్తుందనే భయంతో గుప్తా కూతురిని మీ ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పిన శుక్రవారం ఉదయం భార్య, అత్తతో కలిసి స్వగ్రామం నల్లబిల్లి వచ్చాడు.
 
ఆ తరువాత తమకు వచ్చింది టైఫాయిడ్ జ్వరం కాదనీ.. కరోనా వల్ల వచ్చిన జర్వమే అనే భయంతో గుప్తా దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా గ్రామంలోని శివాలయం వెనకకు వెళ్లారు. కూడా తెచ్చుకున్న పురుగుల మందును ఓఆర్ఎస్‌లో కలిపి గుప్తా, భార్య, అత్త ముగ్గురూ తాగారు. 
 
ఆ తరువాత అక్కడే ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బావి నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ బాధితులకు శుభవార్త... ఏంటది?