Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

సీఎంఓ చెప్పిన‌ట్లే పోలీసులు చేస్తున్నారు: నక్కా

Advertiesment
police
, బుధవారం, 28 జులై 2021 (15:13 IST)
ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలతోనే దేవినేనిపై దాడి జ‌రిగింద‌ని, సీఎంవో చెప్పిన విధంగానే పోలీసులు మాజీ మంత్రి దేవినేని ఉమ‌పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, ఆయన్ని జైలుకు పంపడానికి సిద్ధమయ్యార‌ని మాజీ మంత్రి న‌క్కా ఆనంద్ బాబు విమ‌ర్శించారు.

ముఖ్యమంత్రి కార్యాలయం ఏంచెబితే పోలీసులు అదేచేస్తున్నారు.... దేవినేని ఉమా అరెస్ట్ వ్యవహారంలో కృష్ణా జిల్లా ఎస్పీ పచ్చి అబద్ధాలు చెప్పాడ‌ని ఆరోపించారు. నిన్నసాయంత్రం దేవినేని ఉమా టీడీపీ నేతలతోకలిసి అక్రమ మైనింగ్ ను పరిశీలించడానికి వెళ్లార‌ని, సాయంత్రం 06.15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు, స్థానిక ఎస్సై  దేవినేని ఉమాని వేరే మార్గంలో వెళ్లమని చెప్పాడ‌ని, అటు వెళ్తే వైసీపీ వారున్నారని చెప్పిన ఎస్సై, జీ.కొండూరు వైపు దేవినేని ఉమా వాహనాన్ని మళ్లించాడ‌ని చెప్పారు.

ఆ దారిలోకి వెళ్లగానే, దాదాపు 100 మంది వైసీపీ కార్యకర్తలు, కార్యకర్తల ముసుగులో ఉన్న గూండాలు దేవినేని వాహనంపై దాడి చేశారు ఆరోపించారు. దాడి జరిగాక దేవినేనిని పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా, తన కారులో నుంచి దిగకుండా, పోలీసులే అడ్డుకున్నార‌ని, రాత్రి ఒంటిగంట వ‌ర‌కు దేవినేని కారులోనే ఉన్నాడ‌ని చెప్పారు. ఆ తరువాత కారు అద్దాలు పగుల గొట్టి, ఆయన్ని అరెస్ట్ చేశార‌న్నారు.

దాసరి సురేశ్ అనే వ్యక్తి నుంచి ఫిర్యాదు తీసుకొని, దాన్ని తమకు అనుకూలంగా మార్చిన పోలీసులు, దేవినేనిపై ఎస్సీ,ఎస్టీ కేసు ఫైల్ చేశార‌ని ఆనంద్ బాబు ఆరోపించారు. ఇతర నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి, మాజీ మంత్రిని జైలుకు పంపడానికి రంగం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల ప్రకారమే దేవినేనిపై దాడి జరిగింద‌ని, భౌతిక దాడులకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలు, వారికి సహకరిస్తున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పద‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా