విధి నిర్వహణలో అనేక ఒడిదుడుకులు, నిత్యం బిజీ, కేసులతో టెన్షన్... వెరసి పోలీసులకు దినదిన గండంగా మారుతోంది. పోలీసు శాఖలో ముఖ్యంగా ఎస్.ఐ, సి.ఐ. కేడర్లో వారిపై ఒత్తిళ్ళు అధికమవుతున్నాయి. ప్రతి కేసును స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా సి.ఐ. క్యాడర్ వారే చూడాల్సి రావడంతో టెన్షన్ అధికం అవుతోంది.
నేటి బుధవారం ఉదయం సీఐ శ్రీధర్ రెడ్డి మృతి చెందారు. ఏపీ సిఐడి హెడ్ క్వార్టర్స్‌లో సీఐగా పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో శ్రీధర్ రెడ్డి కుప్పకూలారు. వెంటనే అక్కడ ఉన్నవారు హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
సీఐ శ్రీధర్ రెడ్డి మృతి పట్ల పోలీసు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటుతో ఆయన మరణించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో పోలీసు అధికారులకు తీవ్ర టెన్షన్ ఎదురవుతోందని, ఇది చాలా బాధాకరమని పేర్కొంటున్నారు.