Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కానిస్టేబుళ్ళ ఫలితాలను వెల్లడించిన హోం మంత్రి

కానిస్టేబుళ్ళ ఫలితాలను వెల్లడించిన హోం మంత్రి
, గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:36 IST)
రాష్ట్రంలో పోలీస్ శాఖలోని వివిధ పోలీస్ కానిస్టేబుళ్ల ఖాళీల భర్తీకి నిర్వహించిన వ్రాతపరీక్షా ఫలితాలను రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. ఈ మేరకు గురువారం అమరావతి సచివాలయంలోని ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ ఫలితాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పోలీస్ శాఖలోని 2,723 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా మొత్తం 3లక్షల 94వేల 384 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేయగా వారికి ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్,ఫిజికల్ ఎపిషియెన్సీ వంటీ పరీక్షలు నిర్వహించగా వారిలో 65వేల 575మంది వ్రాత పరీక్షలకు అర్హత పొందారని తెలిపారు.

అర్హత సాధించిన వారికి వ్రాత పరీక్షలు నిర్వహించగా వారిలో 2వేల 673 మంది ఈవ్రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఎస్సిటి సివిల్ కానిస్టేబుళ్లు(పురుష,మహిళ)కు సంబంధించి 1600 ఖాళీలకు గాను 1098 పురుషులు,430 మహిళలు మొత్తం కలిపి 1528 ఖాళీలు భర్తీ చేస్తుండగా మరో 72 ఖాళీలను తర్వాత భర్తీ చేయడం జరుగుతుందన్నారు.

అలాగే ఎస్సిటి కానిస్టేబుళ్లు ఎఆర్ (పురుష,మహిళ)300 ఖాళీలలకుగాను 232 పురుష,47 మహిళల ఖాళీలను భర్తీ చేయడం జరుగుతందన్నారు.ఎస్సిటి కానిస్టేబుళ్లు ఎపిఎస్పి పురుషులకు సంబంధించి 300 ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా వార్డర్స్ పురుషులు100 ఖాళీలు, వార్డర్స్ మహిళలు 23 ఖాళీలను భర్తీచేస్తున్నట్టు చెప్పారు.

అలాగే ఫైర్ మెన్ పురుషులు 400 ఖాళీలకు గాను 393 ఖాళీలను భర్తీ చేయడం జరుగుతోందని మంత్రి సుచరిత పేర్కొన్నారు. కాగా మొత్తం 2వేల 723 ఖాళీలకుగాను ప్రస్తుతం 2వేల 623 పోస్టులను భర్తీ చేస్తుండగా మిగతా 100 ఖాళీలను త్వరలో భర్తీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. 
 
వ్రాత పరీక్షల్లో కడప జిల్లాకు చెందిన జింకా శశికుమార్, గుంటూరు జిల్లాకు చెందిన చల్లా సత్యనారాయణ, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్దారెడ్డి చెన్నారెడ్డి, విజయనగరం జిల్లాకు చెందిన వడపల్లి కోటేశ్వరరావులు 145కు పైగా మార్కులు సాధించి ఉత్తమంగా నిలిచారని హోం మంత్రి సుచరిత చెప్పారు.

అదే విధంగా మహిళలకు సంబంధించి విజయనగంరం జిల్లాకు చెందిన లక్ష్మీ ప్రియాంక 138 మార్కులతో మహిళల విభాగంలో మొదటి స్థానంలో నిలిచారని చెప్పారు. పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన అభ్యర్తులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని హోం మంత్రి వెల్లడించారు.
 
పల్నాడులో శాంతిభద్రతలు అదుపులో.. సుచరిత
పల్నాడు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు ఎంతమాత్రం సమంజసం కాదని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. పల్నాడులో ఏదో జరిగిపోతుందని కొన్ని పార్టీల నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే ఎవరినైనా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.

అలాగే దళితులను కించపరిచేలా ఎవరు మాట్లాడినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి సుచరిత పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధ్యక్షులు కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృంగారంలో ఎప్పుడు పాల్గొంటున్నారో కూడా ఫేస్‌బుక్‌కు తెలిసిపోతోంది.. ఎలా?