ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఆ మంటలతో చలిమంట కాసుకున్నాడంట ఇంకొకడు. అలా ఉంది... కరోనా కర్ఫ్యూ సమయంలో కొందరు ప్రబుద్థుల ప్రవర్తన. కరోనా భయంతో ఇళ్ళ నుంచి బయటకు రావద్దని ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో తిరుపతిలో రద్దీగా ఉన్న రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
అయితే సంక్షోభంలో అవకాశం వెతుక్కున్న చందాన ఓ వ్యక్తి ఓ అమ్మాయికి నడిరోడ్డుపైన స్కూటర్ డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. కర్ఫ్యూతో పాటు 144 సెక్షన్ అమలును తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఓ వైపు టూవీలర్స్ పైన రోడ్డుపైకి వస్తే పోలీసులు లాఠీలతో వీపు విమానం మోత మోగిస్తుంటే ఇతగాడేమో మరోవైపు ఏకంగా డ్రైవింగే నేర్పిస్తున్నాడు.
అత్యవసర పనులకు కూడా రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు భయపడుతున్న సమయంలో తిరుపతిలోని అలిపిరి.. జూపార్కు ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది చూస్తున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.