Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో రెండో పెళ్లి చేసుకునే స్త్రీకి కేసీఆర్ 'కళ్యాణ లక్ష్మి'

Advertiesment
తెలంగాణలో రెండో పెళ్లి చేసుకునే స్త్రీకి కేసీఆర్ 'కళ్యాణ లక్ష్మి'
, గురువారం, 27 జూన్ 2019 (16:45 IST)
తెలంగాణా రాష్ట్రంలోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకమే కళ్యాణలక్ష్మి. 2017, మార్చి 13వ ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్‌లో ఈ పథకానికి సంబంధించిన ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుండి రూ.75,116 లకు పెంచగా... 2018, మార్చి 19న సదరు మొత్తాన్ని రూ.1,00,116కు పెంచారు.
 
కాగా... నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళ ఇబ్బందికర పరిస్థితుల్లో రెండో వివాహానికి సిద్ధమైతే కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల క్రింద గతంలో లబ్ధి పొందని మహిళల రెండో వివాహానికే ఈ ఆర్థిక సహాయం వర్తిస్తుందని పేర్కొంటూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బీ వెంకటేశం ఉత్తర్వులు జారీ చేసారు. సిద్దిపేట జిల్లా పోతపల్లికి చెందిన పీ చిరంజీవి ప్రభుత్వానికి చేసిన వినతి మేరకు మహిళ రెండో వివాహానికి ఆర్థిక సహాయం అందించే విషయంపై విధి విధానాలను రూపొందించినట్టు ఆయన తెలియజేసారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైలులో ఖైదీల వీరంగం: అధికారులపై వేటు..