పవన్ సంచలన వ్యాఖ్యలు.. ఆంధ్రా ప్రజలకు ఆ పట్టుదల లేదు..?

గురువారం, 27 జూన్ 2019 (10:39 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునే విషయంలో తెలంగాణ ప్రజలకు వున్న బలమైన ఆకాంక్ష, పట్టుదల ఆంధ్రప్రజలకు లేదన్నారు. అందుకే ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రావాసులు సత్తా చూపెట్టలేకపోయారని పవన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం దశాబ్ధాల పోరాటం జరిగిందని.. కానీ హోదా విషయంలో మాత్రం అలా జరగలేదన్నారు.
 
ప్రత్యేక హోదాపై చంద్రబాబునాయుడు పలుమార్లు మాట మార్చినా ప్రజల నుండి సరైన నిరసన రాలేదని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి నిరసన రానందునే, తామేమీ చేయలేకపోయామని పవన్ తేల్చేశారు. ప్రత్యేక హోదాను సాధించే విషయంలో ప్రజలతో పాటు పాలకులకు బలమైన ఆకాంక్ష వుండాలన్నారు. 
 
అలాగే ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేతపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ప్రజావేదికతోనే సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలని పవన్ డిమాండ్ చేశారు. అనుమతిలేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలన్నీ కూల్చినప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్పారు. నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తీసుకోవడం సరైందేనని పవన్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం PAK Vs NZ: పాకిస్తాన్ టార్గెట్ 238, న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్ నీషామ్ 97 నాటౌట్