Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం..! ప్రతిపక్ష హోదా కూడా అంతమైంది!

Advertiesment
తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం..! ప్రతిపక్ష హోదా కూడా అంతమైంది!
, గురువారం, 27 జూన్ 2019 (13:05 IST)
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు తెలంగాణలో మరో షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా స్థాయిని కోల్పోయింది. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్‌కు 18 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 
 
అయితే గెలుపొందిన ఆ 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మంది తెరాసలోకి ఫిరాయించి ఆ పార్టీ శాసనసభా పక్షంలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌ను కోరడంతో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష స్థాయి కూడా దక్కకుండా పోయింది. 
 
అంతేకాకుండా సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విపక్ష నేత హోదాను కోల్పోయారు. ఫలితంగా తెలంగాణ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎం ఇప్పుడు అతి పెద్ద పార్టీ అయింది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ వి. నరసింహాచార్యులు బుధవారం నాడు ఓ బులెటిన్ జారీ చేసారు.
 
ఆయన ఇదే విషయమై మల్లు భట్టివిక్రమార్కకు లేఖ రాసారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు సభలో మీ పార్టీ బలం ఆరుకు తగ్గిపోయిందని, ఫలితంగా మీ పార్టీ విపక్ష హోదా కోల్పోయిందని తెలిపారు. 
 
ఈ ఆదేశాలు ఈనెల 6 నుంచే అమల్లోకి వచ్చినట్లు భావించాలని కోరారు. ఇదిలా ఉంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో శాసనసభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఐదుకు తగ్గనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం : మురళీ మోహన్ - గంటా భవనాల కూల్చివేత