Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గన్నవరం ఉప ఎన్నికలకు టిడిపి రెఢీ

Advertiesment
TDP ready
, సోమవారం, 28 అక్టోబరు 2019 (08:13 IST)
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి టిడిపి తరుపున గెలుపొందిన సీనియర్ నేత వల్లభనేని వంశీ త్వరలోనే వైసిపి తీర్ధం పుచ్చుకోనున్నారు.

ఇప్పటికే ఆయన వైసిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్ తో చర్చలు జరిపారు… ఆ పార్టీ నియమ నిబంధనల ప్రకారం పార్టీతో పాటు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత చేరాల్సి ఉంది.. దీంతో వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.. దీంతో తెలుగుదేశం గన్నవరం లో బై ఎన్నికల వస్తే టీడీపీ తరపున పోటీకి  నేతలను సిద్ధం చేస్తున్నారు.

దాదాపు 10 మంది నేతల  పేర్లతో జాబితా సిద్ధం చేశారు. ఈ లిస్ట్ లో బోండా ఉమా, దేవినేని ఉమా, గద్దె అనురాధ, చింతనెని ప్రభాకర్, దేవినేని అవినాష్ తదితరులున్నారు.. గత ఎన్నికల్లో వంశీపై పోటీ చేసి ఓటమి చెందిన వైసిపి వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ను  టీడీపీ లో వచ్చేయందుకు కృషి చేయాలని మాజీ మంత్రి ఉమా కి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

కాగా, మరోవైపు, వంశీ రాక గన్నవరం నియోజకవర్గం వైసీపీలో అలజడి సృష్టిస్తోంది. గత ఎన్నికల్లో వంశీ చేతిలో ఓటమిపాలైన  వెంకట్రావు వర్గీయులు వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇక వంశీ వైసీపీలో చేరితే యార్లగడ్డ భవితవ్యం ఏమిటనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి వేళ పెరిగిన వాయు కాలుష్యం