Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నా : డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా

మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నా : డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా
, మంగళవారం, 21 జనవరి 2020 (11:55 IST)
మూడు రాజధానుల ఏర్పాటును తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. ఇందుకు నిరసన తెలిపే చర్యల్లో భాగంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పైగా, తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. 
 
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు సోమవారం అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. ఇదే బిల్లును మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై నిబంధన 71 ప్రకారం చర్చకు టీడీపీ పట్టుబట్టింది. దీంతో చర్చ ఏ విధంగా సాగాలన్న అంశంపై మండలి ఛైర్మన్ తన చాంబర్‌లో అధికార, విపక్ష సభ్యులతో చర్చలు జరుపుతున్నారు.
 
ఇంతలోనే డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. పైగా, ఆయన మంగళవారం సభకు కూడా రాలేదు. ఆయనతో పాటు.. మరో ఎమ్మెల్సీ శమంతకమణి కూడా మంగళవారం సభకు హాజరుకాలేదు. దీంతో ఆమె కూడా రాజీనామా చేసిందనే ప్రచారం సాగుతోంది. అయితే, ఈ బిల్లుపై మండలిలో చర్చ చేపట్టడానికి ముందే డొక్కా రాజీనామా చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎనిమిదో తరగతి విద్యార్థితో జంప్ అయిన 26 ఏళ్ల టీచర్