Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం జగన్ హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తే.. రోడ్లపై చెట్లు నరికేస్తారా : కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్న

Advertiesment
సీఎం జగన్ హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తే.. రోడ్లపై చెట్లు నరికేస్తారా : కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్న
, ఆదివారం, 25 జూన్ 2023 (10:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప మాఫియా గ్యాంగ్‌ ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దిగి భూకబ్జాలు చేస్తోందని, ప్రశాంతమైన విశాఖను అరాచకాలు, భూకబ్జాలకు అడ్డాగా మార్చేసిందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శనివారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సదస్సులో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రను, ముఖ్యంగా అభివృద్ధి చెందిన విశాఖను దోచుకుతినడానికే వైకాపా మూడు రాజధానుల నాటకాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. 
 
'విశాఖలో బతకలేమని సొంత పార్టీ ఎంపీలే హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఇలాంటి అరాచక పాలన చూడలేదని వైకాపా ఎమ్మెల్యేలే చెబుతున్నారు. వంద మంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్మోహన్‌ రెడ్డి. గతంలో కడప లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తరపున ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరించినప్పుడే ఈ విషయం నా దృష్టికి వచ్చింది. 
 
జగన్‌ 16 నెలలు జైల్లో ఉంటే, అతడి తల్లి, చెల్లి రాష్ట్రమంతా తిరిగారు. ఇప్పుడు వారు ఎక్కడున్నారో అందరికీ తెలుసు. చెల్లిని, తల్లిని నమ్మని జగన్‌ను రాష్ట్ర ప్రజలు మాత్రం ఎందుకు నమ్మాలి?' అని కన్నా ప్రశ్నించారు. 'ముఖ్యమంత్రి ధైర్యంగా ప్రజల్లోకి రావడం లేదు. ఆయన హెలికాప్టర్‌లో వస్తుంటే నేలపై వందేళ్ల నాటి చెట్లు కొట్టేస్తున్నారు. రాష్ట్ర సంపదను గంపగుత్తగా జగన్‌ వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు. ధన, మాన, ప్రాణాల్ని కాపాడలేని ఈ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకోవద్ద'ని ప్రజలకు పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ ఫక్కీలో కారు అడ్డగించి.. రూ.40 లక్షల దోపిడీ.. ఎక్కడ?