Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్ను తీస్కెళ్లు లేదంటే చనిపోతా: అమ్మాయి కాల్, అబ్బాయి ఏం చేశాడంటే?

Advertiesment
నన్ను తీస్కెళ్లు లేదంటే చనిపోతా: అమ్మాయి కాల్, అబ్బాయి ఏం చేశాడంటే?
, మంగళవారం, 29 అక్టోబరు 2019 (21:04 IST)
ఇదివరకు ఓ అమ్మాయి-అబ్బాయి మధ్య ప్రేమ చిగురించాలంటే మామూలు విషయం కాదు. చాలా కష్టం. కానీ ఇప్పుడు ఫేస్ బుక్, టిక్ టాక్, షేర్ చాట్, వాట్స్ యాప్ తదితర సోషల్ మీడియా సైట్లతో ఈజీగా అవతలివారితో పరిచయాలు చేసేసుకుంటున్నారు. ఈ పరిచయాలు కొందరికి మంచి చేస్తుంటే చాలామందికి చెడును చేసేస్తున్నాయి. 
 
అసలు విషయానికి వస్తే, అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన విజయ్ కుమార్ అనే యువకుడితో సోషల్ మీడియాలో ఉండవల్లి గ్రామానికి చెందిన ఓ అమ్మాయి చాటింగు చేయడం మొదలుపెట్టింది. ఆ చాటింగ్ కాస్తా ప్రేమ వరకూ వెళ్లింది. ఇది కూడా ఎన్నిరోజులు అనుకున్నారు? జస్ట్ 2 వారాలే. ఈ రెండు వారాల్లోనే ఆ అమ్మాయితో ఈ అబ్బాయి పీకల్లోతు ప్రేమలో పడిపోయాడు. 
 
చాటింగ్ ముగిసి విషయం ఫోన్ కాల్స్ వరకూ వెళ్లిపోయింది. నువ్వు లేనిదే నేను వుండలేను. త్వరగా వచ్చి నన్ను తీసుకుని వెళ్లిపో అని ఆమె ఫోనులో అడిగేసింది. అతడు కాస్త తటపటాయించేసరికి, నువ్వు తీస్కెళ్లపోతే నేను చనిపోతానంటూ బాంబూ పేల్చింది. దీంతో బెంబేలెత్తిపోయిన సదరు యువకుడు అనంతపురం నుంచి హుటాహుటిని విజయవాడలో ఓ హోటల్లో దిగి అమ్మాయికి ఫోన్ చేశాడు.

ఐతే ఈలోపుగానే విషయం అంతా పెద్దలకు తెలిసిపోయింది. అబ్బాయి బస చేసిన హోటల్ గదికి వచ్చి అతడిని పిచ్చకొట్టుడు కొట్టారు. మైనర్ బాలికతో ప్రేమలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే ఆ యువతి మైనర్ బాలిక అని తనకు తెలియదని సదరు యువకుడు మొరపెట్టుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవుల మధ్య గోపాలుడు : ఆవుల మధ్య ఉల్లాసంగా గడిపిన పవన్