Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి: ముస్లిం పెద్దల విజ్ఞప్తి

మాపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి: ముస్లిం పెద్దల విజ్ఞప్తి
, గురువారం, 16 ఏప్రియల్ 2020 (17:51 IST)
కరోనా వ్యాప్తి పేరుతో ముస్లింలు,ముస్లిం సంస్థల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. జమాతే ఇస్లామీ సంస్థ ప్రతిష్ఠకు భంగం‌కలిగించేలా కొన్ని ఐడీలు విషం చిమ్ముతూ ఆ పోస్ట్ ద్వారా ప్రజల్లో జమాతే  ఇస్లామీ హింద్, మరియు ఇతర సంస్థల పట్ల ప్రజల్లో ద్వేష భావాన్ని పెంపొందించే ప్రయత్నాలు చేశారు.

ఇటువంటి పోస్టుల ద్వారా ముస్లింల పట్ల ద్వేషం కలిగించే పోస్టులు తరచు వస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నాలు మనదేశ సమగ్రతకు ,జాతీయ సమైక్యత భావనలను దెబ్బ తీస్తాయి. ఇది మనదేశ లౌకిక స్పూర్తి కి విఘాతం కలిగిస్తాయి. కనుక ఇటువంటి 120 పోస్టులపై చర్య తీసుకోవాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలకి పలువురు ముస్లిం పెద్దలు విజ్ఞప్తి చేశారు.

కమిషనర్ ను కలిసిన వారిలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షి బ్లీ, జమాత్ ఇస్లాం రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ అహ్మెద్, జమీయతె ఉలేమా రాష్ట్ర కన్వీనర్ మౌలానా హుస్సేన్ మరియు ముస్లిం డెమోక్రాటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు ఎండీ ఫతా ఉల్లాహ్ తదితరులు వున్నారు. పూర్తి ఆధారాలతో పోస్ట్ లింక్లతో మరియు పోస్టుల స్క్రీన్ షాట్ ప్రింట్లను కమిషనర్ కి అందచేసి చట్ట పరమైన చర్యలు తీసుకొని రాజ్యాంగ లౌకిక స్ఫూర్తిని కాపాడాలని కోరారు.

ఇందుకు కమిషనర్ సత్వరం స్పందించి విచారణకు ఆదేశించారు. నిజానికి జమాతే ఇస్లామీ హింద్, జమియతె ఉలేమా దేశ ప్రజల మధ్య‌ సోదరభావం, మతసామరస్యం పెంపొందించడానికి అనేక నిర్మాణాత్మక  కార్యక్రమాలు చేస్తుంది.
 అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు అనేక సేవాకార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది.
 
కరోనా వ్యాపించినప్పటినుండి దేశ వ్యాప్తంగా ప్రజలకు అనేక సేవాకార్యక్రమాలు చేస్తుంది. కనుక రాజ్యాంగ బద్ధంగా పనిచేస్తున్న అనేక ముస్లిం స్వచ్ఛంద సంస్థలపై ఇలాంటి ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి దేశ సమైక్యతను,మత సామరస్యాన్ని పరిరక్షించవలసిందిగా వీరందరూ సీపీని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29 రోజుల శిశువును బలిగొన్న కరోనా.. అత్యంత పిన్న కరోనా బాధితుడిగా..