ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు తీవ్ర విమర్శలు గుప్పిచగా, ఈ విమర్శల్లో కమ్మవారు తలుచుకుంటే జగన్ లేచిపోతారని తాను అన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తాను వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందన్నారు. కమ్మవారిపై ద్వేషం మంచిది కాదంటూ జగన్‌కు తాను సలహా ఇచ్చానని... అన్ని కులాలను కలుపుకుని వెళ్లాలని చెప్పానని తెలిపారు. జగన్‌పై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ద్వేషం లేదని ... ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి తనకు మంచి సన్నిహితుడని చెప్పారు.
ఫ్యాక్షన్ రాజకీయాలకు తొలి నుంచి తాను దూరమని రాయపాటి అన్నారు. తాను అనని మాటలు అన్నట్టు ప్రచారం కావడంతో... రాత్రి నుంచి తనకు వందలాది బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు.
సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్లు పెడుతున్నారన్నారు. పది కాలాల పాటు సీఎంగా కొనసాగాలంటే జగన్ అందరినీ కలుపుకుని పోవాల్సిందేనని ... లేకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని రాయపాటి సాంబశివ రావు స్పందించారు.