పార్టీతో సంబంధం లేదనీ, ఏ ఒక్క మహిళకూ అవమానం జరగకూడదని ఏపీసీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని ఇంట్లో సీఎం జగన్‌తో హోం మంత్రి సుచరిత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, మంత్రి విశ్వరూప్‌లు గురువారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా తనకు జరిగిన అవమానాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఎమ్మెల్యే శ్రీదేవి తీసుకెళ్లారు. తనను కులం పేరుతో దూషించారంటూ ఘటన వివరాలను సీఎంకు తెలియజేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి
రాష్ట్రంలో ఏ మహిళకూ ఇలాంటి పరిస్థితి రాకూడదనీ, ఏ పార్టీకి చెందిన వారికైనా ఇలాంటి అవమానకర పరిస్థితులు ఎదురుకాకూడదన్నారు.
పైగా, బడుగుబలహీన వర్గాలను కలుపుకుని ముందడుగు వేసే వాతావరణం ఉండాలని కోరారు. మహిళల గౌరవానికి భంగం కలిగితే కఠిన చర్యలు తప్పవన్న సంకేతం పోవాలని ఆయన అన్నారు. సమాజంలో అన్నివర్గాలనూ గౌరవించే పరిస్థితి ఉండాలని, అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని హోంమంత్రి సుచరితను సీఎం జగన్ ఆదేశించారు.