Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరీక్ష రాస్తూ ఓ విద్యార్థి మృతి.. పరీక్షలకు భయపడి మరో విద్యార్థి?

Advertiesment
Student
, శనివారం, 2 మార్చి 2019 (16:04 IST)
పరీక్ష రాస్తూ రాస్తూ ఆ విద్యార్థి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒత్తిడి.. మంచి మార్కులు కొట్టాలనే తపననో ఏమో కానీ.. ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తూ ఓ విద్యార్థిని పరీక్షా హాలులోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌లో జరిగింది. 


వివరాల్లోకి వెళ్తే ఎల్లారెడ్డిగూడకు చెందిన ఇంటర్ విద్యార్థి గోపి రాజుకు ప్యారడైజ్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఎగ్జామ్ సెంటర్ పడింది. కాగా, ఇంటర్ ఫస్టియర్ పరీక్ష రాస్తూనే మృతిచెందాడు గోపిరాజు. విద్యార్థికి హార్ట్‌ఎటాక్‌ వచ్చినట్టు చెప్తున్నారు. గోపిరాజు మృతిపై విద్యార్థి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
 
మరోవైపు ఇంటర్మీడియట్‌ విద్యార్థి అదృశ్యమైన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా పీలేరు మండలం చలవ పల్లి గ్రామానికి చెందిన బాణావతి అఖిల్‌నాయక్‌ (17) నగరంలోని గోసాలలో కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్‌ బైపీసీ చదువుతున్నాడు. ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం ఔటింగ్‌కు స్నేహితుడు దిలీప్‌కుమార్‌తో కలిసి పీవీపీలో సినిమాకి వచ్చాడు. 
 
ఇరువురు వేర్వేరు సినిమాలకు టికెట్‌ తీసుకున్నారు. దిలీప్‌ కుమార్‌ సినిమా అయిపోయాక ఎంత సేపు ఎదురుచూసినా రాకపోవడంతో దిలీప్‌కుమార్‌ తిరిగి కళాశాలకు చేరుకున్నాడు. అఖిల్‌ నాయక్‌ తల్లి దండ్రులు అదేరోజు రాత్రి కళాశాలకు ఫోన్‌ చేయగా మీ కుమారుడు సినిమాకి వెళ్లి తిరిగి రాలేదని చెప్పారు. దీంతో ఎంత వెతికినా అఖిల్ నాయక్ కనిపించలేదు.
 
ఫిబ్రవరి 26న అఖిల్ తల్లిదండ్రులు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇంకా అఖిల్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పరీక్షల భయంతోనే ఇంటి నుంచి పారిపోయాడా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే మద్దతిస్తాం.. కాంగ్రెస్సా, బీజేపీనా అనవసరం: జగన్