Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగ్రవాదంపై ఉక్కుపాదం..హోంమంత్రి

ఉగ్రవాదంపై ఉక్కుపాదం..హోంమంత్రి
, గురువారం, 17 అక్టోబరు 2019 (07:02 IST)
2018 బ్యాచ్‌ డీఎస్పీల పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌ను బుధవారం మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ టాలియన్‌ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌లు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో ఐ.జి.పి ట్రైనీ ఐపిఎస్‌ సంజయ్‌ నేతృత్వంలో దీక్షాంత్‌ పెరేడ్‌ అధికారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఏడాది పాటు అనంతపురం పీటీసీలో శిక్షణ పొందిన 25 మంది డీఎస్పీలలో 11 మంది మహిళలు ఉండడం విశేషం.
 ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ .. 25 మందిలో డీఎస్పీలలో 11 మంది మహిళలు ఉండడం చాలా సంతోషం కలిగించిందని పేర్కొన్నారు.

ప్రజలకు ఆపద కలిగినప్పుడల్లా మొదట గుర్తుకు వచ్చేది పోలీసేనని ఆమె స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారికి రక్షణగా నిలవాలని దిశానిర్దేశం చేశారు. దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని వారికి పిలుపునిచ్చారు.

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. కొత్తగా విధుల్లో చేరబోతున్న 25 మంది డీఎస్సీలకు శుభాకాంక్షలు. టైనింగ్‌లో నేర్పిన నాలుగు ప్రధాన సూత్రాలను గుర్తుపెట్టుకొని న్యాయం కోసం వచ్చే ప్రజలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు. పోలీస్‌ విధి నిర్వహణలో సవాళ్లను ఎదుర్కొనేందుకు మానసికంగా, శారీరకంగా ధృడత్వాన్ని ఏర్పరచుకోవాలన్నారు.

ప్రజా సంరక్షణ కోసం నిరంతరం పాటు పడుతూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని డీజీపీ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌కు సహకరించండి.. గవర్నర్