Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీసీలంటే బ్యాక్ బోన్‌ క్లాస్‌‌గా సీఎం జగన్ గుర్తించారు : శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

బీసీలంటే బ్యాక్ బోన్‌ క్లాస్‌‌గా సీఎం జగన్ గుర్తించారు : శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
, మంగళవారం, 19 జనవరి 2021 (20:14 IST)
గొల్లపూడిలో ఏర్పాటు చేసిన 56 బిసి కార్పొరేషన్ ఛైర్మన్ల కార్యాలయాలను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. కార్పొరేషన్ ఛైర్మన్‌ కార్యాలయాలను త్వరగా సిద్దం చేయాలని మంత్రి చెల్లుబోయిన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనులపై అధికారులతో మంత్రి గారు సమీక్షించారు. అనంతరం మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే 56 కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ ఎండీలకు కేటాయించిన చాంబర్లలో బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. 
 
రాష్ర్టంలోని బలహీనవర్గాల్లో 139 కులాలుగా గుర్తించి 56 కార్పొరేషన్లకు ఏర్పాటు చేసి ఛైర్మన్‌లను, డైరెక్టర్‌లను సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి నియమించారని ఇలాంటి కార్యక్రమం దేశచరిత్రలో ఇంతవరకు జరగలేదని మంత్రి గుర్తు చేశారు. చాలా కులాలు కనీసం కుల ప్రస్తావన చేయడానికి ఆలోచించే పరిస్థితిని సీఎం జగన్ మార్చారన్నారు. బీసీలంటే బ్యాక్ బోన్‌ క్లాస్‌ అని చెప్పటమేకాకుండా రాజకీయంగా వారికి మెరుగైన అవకాశాలను సీఎం జగన్ కల్పించారని చెల్లుబోయిన అన్నారు. 
 
బీసీలు వెనుకబడిన కులాలు కాదు.. వెన్నుముక కులాలని గుర్తించిన ఒకే ఒక్క నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని చెల్లుబోయిన స్పష్టం చేశారు. బలహీన వర్గాల కోసం కృషి చేసిన నాటి సంఘసంస్కర్తల ఆలోచనలు, ఉద్యమకారుల ఆశయాలను నేడు బలహీన వర్గాలకు అందిస్తున్న ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. 56 బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు వారి వారి కులాలకు సేవ చేసే భాగ్యాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి అందించారన్నారు
 
రాష్ర్టంలోని బలహీనవర్గాల్లో 139 కులాలుగా గుర్తించి 56 కార్పొరేషన్లకు ఏర్పాటు చేసి ఛైర్మన్‌లను, డైరెక్టర్‌లను సీఎం శ్రీ వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి నియమించారని ఇలాంటి కార్యక్రమం దేశచరిత్రలో ఇంతవరకు జరగలేదని మంత్రి గుర్తు చేశారు. చాలా కులాలు కనీసం కుల ప్రస్తావన చేయడానికి ఆలోచించే పరిస్థితిని సీఎం జగన్ మార్చారన్నారు. బీసీలంటే బ్యాక్ బోన్‌ క్లాస్‌ అని చెప్పటమే కాకుండా రాజకీయంగా వారికి మెరుగైన అవకాశాలను సీఎం జగన్ కల్పించారని చెల్లుబోయిన అన్నారు. 
 
బీసీలు వెనుకబడిన కులాలు కాదు.. వెన్నుముక కులాలని గుర్తించిన ఒకేఒక్క నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని చెల్లుబోయిన స్పష్టం చేశారు. బలహీన వర్గాల కోసం కృషి చేసిన నాటి సంఘసంస్కర్తల ఆలోచనలు, ఉద్యమకారుల ఆశయాలను నేడు బలహీన వర్గాలకు అందిస్తున్న ఘనత శ్రీ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. 56 బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు వారి వారి కులాలకు సేవ చేసే భాగ్యాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి అందించారన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.రామారావు (ఐఏఎస్), విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడివాడ సందుల్లో పరిగెత్తించి కొట్టడం ఖాయం : కె.పట్టాభిరామ్