టిటిడి పరిధిలో ఇతర ప్రాంతాల్లో గల ఆలయాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తిరుపతి జెఈవో పి.బసంత్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం ఆయా ఆలయాల అధికారులతో జెఈవో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కన్యాకుమారి, చెన్నై, ముంబయి, ఢిల్లీ, కురుక్షేత్ర, బెంగళూరు, హైదరాబాద్‌లోని ఆలయాల్లో జరుగుతున్న ఇంజినీరింగ్ పనుల పురోగతిని జెఈవో అడిగి తెలుసుకున్నారు.
కల్యాణమండపాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని, డార్మెటరీలు, వసతిగదుల వద్ద నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ కార్యాలయాల్లో కాగితరహిత పాలన సాగించాలని, ఇఆర్‌పిని అమలు చేయాలని, అంతర్గత ఆడిట్ తప్పకుండా చేయాలని ఆదేశించారు.
సిబ్బంది కొరత, పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతి గురించి ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇకపై జరిగే వీడియో కాన్ఫరెన్సుల్లో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్ఏసిఏవో ఓ.బాలాజి, అదనపు ఎఫ్ఏసిఏవో రవిప్రసాదు, సిఏవో శేషశైలేంద్ర, డెప్యూటీ ఈవో(జనరల్) సుధారాణి, ఇడిపి ఓఎస్‌డి వేంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు.