Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిడిపి ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక బాధ్యతలు..ఏంటో తెలుసా?

Advertiesment
Special responsibilities
, బుధవారం, 23 డిశెంబరు 2020 (12:12 IST)
టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యదర్శులకు బుధవారం ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. ఒక్కొక్కరికి, ఐదు లోక్‌ సభ నియోజకవర్గాల చొప్పున ఐదుగురికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు.

మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలను ఐదు జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్‌ లోని ఐదు లోక్‌ సభ నియోజకవర్గాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.

1. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అరకు బాధ్యతలను అప్పగించారు.
2. పంచుమర్తి అనురాధకు కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, ఏలూరు బాధ్యతలను అప్పగించారు.
3. బత్యాల చెంగల్రాయుడికి విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల బాధ్యతలను అప్పగించారు.
4. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ కు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట బాధ్యతలను అప్పగించారు.
5. మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డికి కడప, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల బాధ్యతలను అప్పగించారు.
6. దేవినేని ఉమకు భావసారూప్య ఉన్న ఇతర రాజకీయ పార్టీలతో సమన్వయ బాధ్యతలను అప్పగించారు.
7. పయ్యావుల కేశవ్‌ కు అధికార ప్రతినిధులపై పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు.
8. ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామికి 25 లోక్‌ సభ స్థానాల నుంచి వచ్చే నివేదికలను పరిశీలించే బాధ్యత ను చంద్రబాబు అప్పగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మమత మరో షాక్‌...! ఏంటో తెలుసా?