వేలివెన్నులక్ష్మీ గణపతి నిమజ్జనోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానాలు అందిస్తోంది. విజయవాడలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్టచర్, ఇన్వెస్ట్ మెంట్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ టి.ఎస్.ఎన్.మూర్తి, ఐ.ఆర్.ఎస్.ను ఉత్సవ కమిటీ ప్రత్యేకంగా కలిసింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్ను గ్రామంలో గాంధీ బొమ్మ సెంటరు వద్ద శ్రీ లక్ష్మీ గణపతి స్వామి మంటపాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. గత 65 సంవత్సరాలుగా వేలివెన్నులో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఒక ఏడాది చేసిన దానికి భిన్నంగా, మరో ఏడాది అలకారాలు చేయడం ఇక్కడ ప్రత్యేకకత. గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం వేలివెన్నులక్ష్మీ గణపతి నిమజ్జనోత్సవానికి ప్రముఖులందరినీ ఆహ్వానిస్తున్నారు. ఆ రోజంతా జరిగే నిమజ్జనోత్స ముగింపు ఉత్సవాలకు అతిథులను వేలివెన్ను కమిటీ ప్రతినిధులు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు.
సొసైటీ వైస్ ఛైర్మన్ సుబ్బారాయుడు, గ్రామ వై.సి.పి కన్వీనర్ శిరిగిన శివ రాధాక్రిృష్ణ, బ్రహ్మయ్య చౌదరి తదితరులు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్టచర్, ఇన్వెస్ట్ మెంట్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ టి.ఎస్.ఎన్.మూర్తిని కలిసి ఉత్సవ ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఇక్కడి గణేషుడు ఎన్నో ప్రత్యేకతలు కలిగిన వారని, 65 ఏళ్ళుగా సంప్రదాయంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు ఎంతో ఘన చరిత్ర ఉందని ఐ.ఆర్.ఎస్. టి.ఎస్.ఎన్.మూర్తి కొనియాడారు.
వచ్చే సోమవారం జరిగే ఉత్సవాలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ వై.సి.పి కన్వీనర్ శిరిగిన శివ రాధాక్రిృష్ణ, బ్రహ్మయ్య చౌదరి తదితరులు టి.ఎస్.ఎన్.మూర్తిని సన్మానించారు.