Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిడిపిలో ఇప్పటి వరకు ఒక లెక్క..! ఇకనుండి మరో లెక్క

టిడిపిలో ఇప్పటి వరకు ఒక లెక్క..! ఇకనుండి మరో లెక్క
, బుధవారం, 14 అక్టోబరు 2020 (20:30 IST)
2019 ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ బలోపేతానికి టిడిపి అనేక ప్రయోగాలు చేస్తుంది.ఓటమికి కారణాలను అధ్యయనం చేసిన టిడిపి పార్టీలో సమూల మార్పులకు నాంది పలికింది.జిల్లా పార్టీ విధానానికి స్వస్తి పలికి పార్లమెంట్ పార్టీ విధానాన్ని తీసుకొచ్చింది.

అందులో భాగంగా అనుబంధ సంఘాలకు నూతనుత్తేజం తీసుకురావడమే లక్ష్యంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు.ఇటీవల తెలుగు మహిళ పార్లమెంట్ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు.వీరి ఎంపికలో పార్టీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది.మొత్తం 50 ప‌ద‌వుల‌కు గానూ అత్యధికంగా 20 ప‌ద‌వుల‌కు బీసీ మ‌హిళ‌ల్ని ఎంపిక చేశారు.

ద‌ళిత మ‌హిళ వంగ‌ల‌పూడి అనిత‌కు తెలుగు మ‌హిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాలు అప్పజెప్పింది.ఎస్సీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన  7 మంది మహళల్ని ఎంపికి చేయడం జరిగింది.ఇద్దరు ఎస్టీలకు చోటు  కల్పించడం జరిగింది.ముగ్గురు మైనారిటీలకు చోటు కల్పించడం జరిగింది.యువత కి మహిళా విభాగం లో పెద్ద పీట వేసారు.

అమరావతి టిడిపి కార్యాలయంలో నూతనంగా నియమించిన తెలుగు మహిళ పార్లమెంట్ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు.అనుబంధ సంఘాల ప్రక్షాళన,బలోపేతం లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.

గతంలో జరిగిన లోటుపాట్లు,భవిష్యత్తు కార్యాచరణ పై నూతనంగా నియమితులైన తెలుగు మహిళ పార్లమెంట్ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు అభిప్రాయాలు తెలిపారు.తెలుగు మహిళ అధ్యక్షురాలు మాట్లాడుతూ పనితీరు ఆధారంగా కమిటీ ఏర్పాటు చేయడాన్ని ఏంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

మహిళా సమస్యల పై నిత్యం క్షేత్ర స్థాయిలో పోరాడే వారికి పదవులు ఇవ్వడం ద్వారా రానున్న రోజుల్లో తెలుగు మహిళా విభాగం సత్తా ఏంటో చూపిస్తాం అని అన్నారు.రాక్షస పాలనలో మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.వారి పక్షాన పోరాడతామన్నారు అనిత.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ కొత్తగా ఎంపికైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

గతంలో జరిగిన తప్పులు బేరీజు వేసుకున్నాం.ఇప్పుడు పూర్తి ప్రక్షాళనకు ప్రాధాన్యత ఇస్తున్నాం.పేరుకి అనుబంధ సంఘాలు అన్నట్టు కాకుండా.అనుబంధ సంఘాలే పార్టీ కి వెన్నుముక అనే విధంగా గుర్తింపు ఇస్తున్నాం.ఎంతో కసరత్తు చేసి మీకు అవకాశం ఇచ్చాం.కష్టపడే వారికే పదవులు,గుర్తింపు.అలంకారంగా భావిస్తే మూడు నెలల్లో మార్పు తప్పదు అని అన్నారు.ప్రతి మూడు నెలలకోసారి పనితీరు పై సమీక్ష ఉంటుందని తెలిపారు.

పార్టీ నీడలో అనుబంధ సంఘాలు పనిచెయ్యడం కాదు.అనుబంధ సంఘాల ఎజెండా పార్టీ అమలు చేసే విధంగా పనిచెయ్యాలి అని మార్గనిర్దేశం చేసారు.అధికారంలోకి వస్తే అనుబంధ సంఘాలకు గుర్తింపు ఉండదు అనే భయం మీకు అవసరం లేదు,అధికారంలోకి  వచ్చిన తరువాత మహిళల కోసం తీసుకునే ప్రతి నిర్ణయంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుంది.జగన్ రెడ్డి పాలనలో మహిళలు పడుతున్న సమస్యలు అన్ని,ఇన్ని కావు.మహిళలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా జగన్ రెడ్డి నిలబెట్టుకోలేదని లోకేష్ అన్నారు.మొదటిది అర్ద ఒడి...ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా ఇస్తా అన్నారు.మాట మార్చారు.

45 ఏళ్లకే పెన్షన్ అన్నారు...హామీ గాల్లో కలిసిపోయింది.సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు.ఇప్పుడు గల్లీ కో బెల్టు షాపు,ఊరికో బ్రాందీ షాపు,బార్లు,లిక్కర్ మార్ట్లు .లేని దిశ చట్టం తో మహిళలకు 21 రోజుల్లో న్యాయం అన్నారు.రోజుకో మృగాడు మహిళల పై అత్యాచారాలకు పాల్పడుతున్నాడు.

మొన్నే చూసాం 9 ఏళ్ల బాలిక పై రేప్ చేసాడు ఒక దుర్మార్గుడు.న్యాయం జరిగిందా?ఒక్క మహిళకైనా 17 నెలల్లో న్యాయం జరిగిందా?వైకాపా నాయకులే మహిళల పై దాడులు చేస్తున్నారు.నెల్లూరు లో ఎంపీడీవో సరళ గారిపై కోటంరెడ్డి దాడి చేసాడు.దళిత మహిళ అనితా రాణి గారిపై మంత్రి పెద్దిరెడ్డి దాడి.ఆమె డ్రెస్ మార్చుకుంటుంటే వైకాపా వాళ్ళు వీడియోలు తీస్తారు.

ఇలా అనేక అరాచకాలు.పెంచుకుంటూ  పోతా అన్న జగన్ రెడ్డి మహిళల పై భారం పెంచుకుంటూ పోతున్నారు.కరెంట్ బిల్లు పెంచాడు,గ్యాస్ ధర పెంచాడు,ఇక నిత్యావసర సరుకులు,కూరగాయల ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి.మనం కులం,మతం,ప్రాంతం చూడకుండా డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకు ఏడాదికి పసుపు-కుంకుమ కింద 10 వేలు ఇచ్చాం.

ఉన్న పథకం ఎత్తేసి కొంతమందికే చేయూత అంటున్నారు.పండగలు వస్తే మనం కానుకలు ఇచ్చాం,సంక్రాంతి కానుక ,రంజాన్ తోఫా,క్రిస్మస్ గిఫ్ట్,ఇప్పుడు ఆ పధకాలు ఉన్నాయా?అవ్వలకు 3 వేల పెన్షన్ అని మోసం చేసారు.ఏడాదికి 250 పెంచుతాం అన్నారు...పెంచారా?ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు రద్దు చేసారు. ఆఖరికి స్కూల్ కి వెళ్లే బాలికలకు సైకిళ్లు ఇచ్చే పథకాన్ని కూడా రద్దు చేసారు.జగన్ రెడ్డి మహిళలకు తీరని అన్యాయం చేస్తున్నారు.

ప్రశ్నిస్తే కేసులు,విమర్శిస్తే దాడులు. ఒక ఉన్మాది పాలనలో మనం ఉన్నాం.పోరాటమే ఉన్మాదికి సమాధానం అని లోకేష్ అన్నారు.అమరావతి పోరాటంలో మహిళల శక్తి ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసొచ్చింది.జై అమరావతి అంటూ కేసులు,అవమానాలను లెక్క చెయ్యకుండా మహిళలు చేసిన ఉద్యమానికి ప్రభుత్వం వణికిపోయింది.

అలాంటి స్ఫూర్తి అన్ని జిల్లాల్లో రావాలి.అందరూ ఐక్యంగా పోరాడితే ఎవ్వరూ ఏమి చెయ్యలేరు.మహిళకు సమస్య ఉంది అంటే మీరెక్కడ ఉండాలి.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే వారికి అవకాశాలు ఇవ్వండి.ప్రాణం పొసే మహిళకు పోరాటం ఒక లెక్కా?నియంత జగన్ రెడ్డి కొమ్ములు వంచాలని అన్నారు.

ఈ సమావేశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత,పార్లమెంట్ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మార్ట్ కత్తి.. ఆ సమయంలో భద్రకాళిలా మారి చీల్చి చెండాడవచ్చు..