Publish Date: Fri, 10 Jul 2020 (09:39 IST)
Updated Date: Fri, 10 Jul 2020 (09:40 IST)
కంచే చేను మేసినట్లుంది ఏపీ ఎక్సైజ్ శాఖలోని కొంతమంది పోలీసుల పని తీరు. అక్రమ మద్యాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చెబుతుంటే.. స్వయంగా ఎక్సైజ్ శాఖ పోలీసులే ఆ పనికి పాల్పడుతుండడం విస్తుగొలుపుతోంది.
వివరాల్లోకి వెళితే..తెలంగాణ నుంచి ఆంధ్రాకు మద్యం అక్రమంగా తరలిస్తున్న ఎస్ఐ, ఎక్సైజ్ సీఐ అరెస్ట్ అయ్యారు. పక్కా సమాచారంతో గురువారం రంగంలోకి దిగిన పోలీసులు చింతలపూడి మండలం లింగంగూడెం బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయగా అక్రమ మద్యం తరలిస్తున్న పలువుర్ని అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిలో కృష్ణా జిల్లా బంటుమిల్లి ఎక్సయిజ్ సీఐ పులి హనుశ్రీ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్.ఐ. విజయ కుమార్, ఏలూరుకు చెందిన నున్న కమల్, సంతోష్‌లు ఉన్నారు. నిందితుల నుంచి ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, 557 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన మద్యం విలువ ఆంధ్రాలో సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా.. మరో నిందితుడు నాగరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఎం
Publish Date: Fri, 10 Jul 2020 (09:39 IST)
Updated Date: Fri, 10 Jul 2020 (09:40 IST)