Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

Advertiesment
cpi narayana

ఠాగూర్

, ఆదివారం, 11 మే 2025 (16:01 IST)
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధానికి స్వస్తి చెప్పాలంటూ తాను వ్యాఖ్యానిస్తే బీజేపీ నేతలు మాత్రం తనను పాకిస్థాన్‌కు పంపాలంటూ కామెంట్స్ చేశారని, ఇపుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను ఆక్రమించుకోకుండా పాకిస్థాన్‌తో సంధి కుదుర్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ మోడీని పాకిస్థాన్‌కు పంపాలా లేదా మరెక్కడికైనా పంపాలా అంటూ  సీపీఐ సీనియర్ నేత కె.నారాయణ ప్రశ్నిస్తున్నారు. 
 
ఇదే అంంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, ఉగ్రవాదులతో ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందన్నారు. ఉగ్రవాదాన్ని అణిచి వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ విరమణ, శాంతి చర్చలను తాను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. పాకిస్థాన్‌లోని అమాయక ప్రజలపై కాకుండా ఉగ్రవాదులపై దాడి చేయమని చెప్పినందుకు మమ్మల్ని అపార్ధం చేసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. 
 
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, "గతంలో నేను యుద్ధం విరమించాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తే, బీజేపీ నాయకులు తనను పాకిస్థాన్ పంపాలని అన్నారు. మరి ఇప్పుడు వారే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ను పూర్తిగా మన నియంత్రణలోకి తేకుండానే పాకిస్థాన్‌‍తో శాంతి చర్చలకు ఎందుకు వెళ్లారు? ఆనాటి వారి లాజిక్ ప్రకారం.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్థాన్ పంపాలా?" అని ఘాటుగా ప్రశ్నించారు. ఇటువంటి ద్వంద్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు.
 
ఉగ్రవాదం ఎప్పటికీ ప్రమాదకరమైనదేనని నారాయణ స్పష్టం చేశారు. "ఉగ్రవాదులు మానవాళికి పెను ముప్పు. ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, చర్యలు చేపట్టాల్సిందే. ఇందులో ఎలాంటి ఉపేక్షకు తావులేదు" అని ఆయన అన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము చెప్పిన విషయాన్ని కొందరు అపార్థం చేసుకుంటున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
 
అయితే, భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ విరమణ ఒప్పందాలు, శాంతి చర్చల పురోగతిని తాము స్వాగతిస్తున్నామని నారాయణ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనడం మంచి పరిణామమేనని ఆయన అభిప్రాయపడ్డారు. "ఉగ్రవాదులపై దాడి చేయాలని మేం స్పష్టంగా చెప్పినప్పటికీ, మా మాటలను వక్రీకరించి, మమ్మల్ని అపార్థం చేసుకోవడాని తీవ్రంగా ఖండిస్తునా " అని నారాయణ తన ఆవేదనను వ్యక్తం చేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!