Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి చెంత అన్యమతస్తులు... ఏం చేస్తున్నారంటే...?

ధార్మిక సంస్థ టిటిడిలో మరోసారి అన్యమతస్థుల వ్యవహారం తెరపైకి వచ్చింది. టిటిడిలో 1500 మందికి పైగా అన్యమతస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తమకు కేటాయించిన వాహనాల్లోనే కొంతమంది చర్చిలకు వెళ్ళడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. తాజాగా టిటిడి వెల్ఫేర్ డిపార్టుమెంట

శ్రీవారి చెంత అన్యమతస్తులు... ఏం చేస్తున్నారంటే...?
, శనివారం, 9 డిశెంబరు 2017 (21:44 IST)
ధార్మిక సంస్థ టిటిడిలో మరోసారి అన్యమతస్థుల వ్యవహారం తెరపైకి వచ్చింది. టిటిడిలో 1500 మందికి పైగా అన్యమతస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తమకు కేటాయించిన వాహనాల్లోనే కొంతమంది చర్చిలకు వెళ్ళడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. తాజాగా టిటిడి వెల్ఫేర్ డిపార్టుమెంట్లో పనిచేస్తున్న స్నేహలత వ్యవహారం బయటకు వచ్చింది.  
 
ప్రముఖ ధార్మిక సంస్థ టిటిడిలో 9 వేల మందికిపైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. టిటిడిలో పనిచేయాలంటే 1989లో జారీ చేసిన జీవో నెంబర్.. 1060 సర్వీస్ రూల్స్ 9(v) ప్రకారం దేవస్థానం ఉద్యోగం చేరినప్పుడు ప్రమాణ స్వీకారం పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. దేవునిపై నమ్మకంతో విధులు నిర్వర్తించాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది పూర్తి విరుద్ధంగా ఉంటోంది. 
 
టిటిడిలో పనిచేస్తూ.. స్వామివారికి హుండీ ద్వారా వచ్చే నిధులను జీతాల రూపంలో తీసుకుంటూ చివరకు చర్చిలకు వెళుతున్నారు కొంతమంది ఉద్యోగస్తులు. అది కూడా టిటిడిలో కేటాయించిన వాహనాల్లోనే చర్చిలకు వెళుతుండటం ఇప్పుడు మరింత వివాదాస్పదమవుతోంది. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని వెల్ఫేర్ డిపార్టుమెంట్లో పనిచేస్తున్న స్నేహలత ప్రస్తుతం అదే పనిచేస్తున్నారు. టిటిడి నుంచి వేల రూపాయలు జీతాలు తీసుకుంటున్న స్నేహలత ఏకంగా టిటిడి కేటాయించిన వాహనాన్నే చర్చిలకు తీసుకెళుతున్నారు. 
 
అంతటితో ఆగడం లేదు. తిరుమల స్వామివారు ప్రసాదాలను తినడం లేదు. హిందూ మతంపై ఎలాంటి గౌరవం లేదు. అలాంటి మహిళ ప్రస్తుతం టిటిడిలో ఉన్నత స్థానంలో ఉండటంపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. హిందూ మతంపై గౌరవం లేని వ్యక్తి ఎలా టిటిడిలో అత్యున్నత పదవిని ఇచ్చి కూర్చోబెడతారని హిందూ ధార్మిక సంఘాలు టిటిడి ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా స్నేహలత టిటిడి కేటాయించిన కారులో చర్చికి వెళ్ళి అడ్డంగా దొరికిపోయారు.
 
టిటిడిలో అన్యమతస్తుల వ్యవహారంపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే అన్యమతస్తులను ఉద్యోగం నుంచి తొలగించాలని విశ్వహిందూ పరిషత్‌కు చెందిన హిందూ ధార్మికవేత్తలు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌ను కలిశారు. అన్యమతస్తుల కారణంగా టిటిడి ప్రతిష్ట దిగజారే అవకాశం ఉందని ఈఓ దృష్టికి తీసుకెళ్ళారు. టిటిడి ఉన్నతాధికారులు స్పందించకుంటే మాత్రం దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హిందూ ధార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎక్కడ అవినీతి జరిగినా వెంటనే సమాచారమివ్వండి - ఎసిబి డిజి ఠాగూర్ (వీడియో)